Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జాతకం గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఇదివరకే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తరుణంలో వేణు స్వామి ఈమె జాతకాన్ని బట్టి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన విధంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట విడాకులు తీసుకొని విడిపోవడం అనంతరం వారి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంత బిజీగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత జాతకం గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నటువంటి సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమంత జాతకం ప్రకారం ఆమె జాతకంలో మూడు వివాహాలు జరగబోతున్నాయని ఉందని అయితే మూడు పెళ్లిళ్లు జరిగిన సమంతకు మాత్రం తల్లి అయ్యే భాగ్యం లేదని అమ్మతనానికి సమంత నోచుకోదు అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
పిల్లలు పుట్టారా…
ఇలా సమంతకు మూడు పెళ్లిళ్లు జరిగిన పిల్లలు మాత్రం పుట్టరు అంటూ ఆమె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు వైరల్ కావడంతో కొంతమంది సమంత అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ కూడా ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం సమంతకు పెళ్లి ఆలోచన కూడా లేదని తన దృష్టి మొత్తం తన ఆరోగ్యం పైన అలాగే తన సినీ కెరియర్ పైన మాత్రమే ఉందని ఇవన్నీ కూడా కేవలం అవాస్తవాలే అంటూ సమంత గురించి వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేస్తున్నారు. ఇక సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.