Today Gold Rate: వచ్చే వేసవిలో పెళ్లిళ్లు పెట్టుకొని బంగారం కొనటం కోసం ఎదురుచూస్తున్న జనాలకి శుభవార్త నేడు పసిడి ధర కొంత మేరకు తగ్గాయి. బంగారం ధరలు ఎండల కంటే ఎక్కువగా మండిపోవటంతో పసిడి ప్రియులు ఉసూరుమంటున్నారు. నేడు ధర తగ్గటంతో పెళ్లిళ్లు చేయాలి అనుకునే వాళ్ళకి బంగారు ప్రియులకు ప్రధానంగా మహిళలకి ఇది శుభవార్త ని చెప్పాలి.
బంగారం రేటు తగ్గిన మాట నిజమే కానీ వెండి మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవటం వలన దేశ మార్కెట్లో కూడా దాని ప్రభావం కనిపించింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర తగ్గు ముఖం పడితే వెండి ధర మాత్రం ఓ రేంజ్ లో ఆకాశాన్ని అంటుతుంది. ఏప్రిల్ 7వ తారీకు నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు మేరా తగ్గి రూ.60,870కి పడిపోయింది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు క్షీణించి రూ.505,800కి పడిపోయింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ.55,800 పలికితే 24 క్యారెట్ల బంగారం రూ.60,870 వరకు ధర పలికింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి కాకపోతే ప్రయాణ ఖర్చుల నేపథ్యంలో కొంతమేర హెచ్చుతగ్గులు ఉండొచ్చు.’
Today Gold Rate:
బంగారం ఈ విధంగా ఉంటే వెండి మాత్రం ఓ రేంజ్ లో పైకి పరిగెడుతుంది నేడు 200 రూపాయలు ధర పెరిగి ఈ రోజుకి రూ.80,200 కి చేరుకుంది. ఇదే నగల విషయానికి వస్తే తరుగు, మజూరి, మేకింగ్ చార్జీలు, జిఎస్టి ఇవన్నీ కలుపుకుంటే బంగారము వెండి ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
10 గ్రాములు గరిష్టంగా రూ.68,000 చేరవచ్చని అంచనా. రానున్న వేసవిలో శుభకార్యాలు పెట్టుకున్న వారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.