Tollywood ఆ డైరెక్టర్ రూమ్ కి ఒంటరిగా రమ్మన్నాడు అంటున్న ఆర్జీవి హీరోయిన్ అప్సర రాణి …

Jaya Kumar

Tollywood సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకోవాలంటే హీరోయిన్‌లు దర్శక, నిర్మాతలకు ఫేవర్‌ చేయాల్సిందేనంటూ కొందరు నటీమణులు ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో ఒక్కో హీరోయిన్‌ బయటకు వస్తూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు ఓపెన్ గా మాట్లాడారు. కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు తమ కోరికలు తీరిస్తేనే అవకాశాలు ఇస్తామంటూ వేధించిన విషయాలను నటీమణులు బయటపెట్టారు.

‘మీటూ’ అంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమం కూడా నడిచింది. తాజాగా మరో నటి అప్సర రాణి కూడా ఈ విషయంలో తన మనసులో మాటను బయటపెట్టింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరక్కించిన సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ క్రమంలోనే ఆమెకి ‘క్రాక్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. సినిమాతో పాటు అప్సర రాణి స్పెషల్ సాంగ్ కి కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా కన్నడలో ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని … సినిమా డిస్కషన్స్ కోసం దర్శకుడు రూమ్ కి ఒంటరిగా రమ్మని పిలిచాడని చెప్పింది.

తన కోరిక తీరిస్తేనే మూవీలో అవకాశం ఇస్తానని చెప్పిన విషయాన్ని అప్సర రాణి వెల్లడించింది. అయితే తాను మాత్రం అక్కడకి తండ్రిని వెంటబెట్టుకొని వెళ్లానని… పరిస్థితి అర్ధమై సదరు దర్శకుడు వెంటనే అక్కడ నుంచి పారిపోయాడని చెప్పింది. కాగా ఆ డైరెక్టర్ పేరుని మాత్రం బయటపెట్టలేదు ఈ హీరోయిన్. తెలుగులో మాత్రం తనకు అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. టాలెంట్ ఉన్న వాళ్లకు తెలుగులో మంచి అవకాశాలే వస్తాయని… ఒక సినిమా ఆడితే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

- Advertisement -