Shraddhadas: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చాలామంది పలు సినిమాలలో నటించి ప్రేమించుకోవడం అనంతరం బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక కొంతమంది సెలబ్రెటీలు ఇంకొక అడుగు ముందుకేసి పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత విడిపోతున్నారు ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని విడిపోయినటువంటి దాఖలాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
ఇలా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రద్ధదాస్ ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై కూడా పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నటువంటి శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇలా తన గ్లామర్ షో ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఒక యంగ్ హీరోతో రిలేషన్ లో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఏకంగా హీరోతో కలిసి గదిలో రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోయినటువంటి శ్రద్ధాదాస్ ఆ హీరోతో ఎంతో సరదాగా గడుపుతూ కనిపించారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింద. దీంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
యంగ్ హీరోతో రొమాన్స్…
ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యు అంటూ ఈ ఫోటోపై కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇదేంటి శ్రద్ధ ఆ హీరోతో ఇలా కనిపించి షాక్ ఇచ్చావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె ఏ హీరో తో గదిలో అడ్డంగా బుక్ అయ్యారు అనే విషయానికి వస్తే ఆ హీరో మరెవరో కాదు అభితేష్ ద్వివేది(Abhitesh Dvivedi)..శ్రద్ధదాస్ (Shraddha Das) ఆయన మెడ పై చేతులు వేసి తనపై కూర్చొని ఒకరి కళ్ళల్లో మరొకరు ఎంతో లీనం అయిపోయి చూసుకుంటూ ఉన్నటువంటి ఫోటోని శ్రద్ధా దాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.