Tollywood Hero : ఈ ఫోటోలో కనిపస్తున్న లెజెండరీ హీరో ఎవరో గుర్తు పట్టారా…?

Joythi R

Tollywood Hero టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ప్రముఖ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే అన్నగారు నందమూరి తారక రామారావు మరణించిన తర్వాత ఆయన తనయులు నందమూరి హరికృష్ణ మరియు నందమూరి బాలకృష్ణ తదితరులు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి అన్నగారి నట వారసులు గా పరిచయమయ్యారు.

కాగా ఇందులో నందమూరి బాలకృష్ణ దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోగా నటించి తండ్రికి తగ్గ తనయుడిగా నటనలో గుర్తింపు తెచ్చుకొని ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నాడు. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేస్తున్నాడు. దీంతో ఒకపక్క సినిమా షూటింగులు మరోపక్క ఎమ్మెల్యే బాధ్యతలు బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అయితే తాజాగా నటుడు నందమూరి బాలకృష్ణ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో బాలకృష్ణ చిన్నప్పుడు దిగినటువంటి ఫోటోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు నందమూరి బాలకృష్ణ పెళ్లయిన కొత్తలో తన శ్రీమతి వసుంధరతో కలిసి దిగిన ఫోటోలను కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో చిన్నప్పుడు నందమూరి బాలకృష్ణ ఎంత క్యూట్ గా ఉండేవాడు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tollywood Hero : ఈ ఫోటోలో కనిపస్తున్న లెజెండరీ హీరో ఎవరో గుర్తు పట్టారా…?

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం దాదాపుగా 140 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం బాలకృష్ణ అఖండ చిత్రం సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో తన తదుపరి చిత్రం షూటింగ్ పనులు వేసవి తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- Advertisement -