Tollywood Heroes: సాధారణంగా ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలంటే అందమైన ముఖ కవళికలు కాకుండా జుట్టు కూడా ఎంతో అవసరం. అది ఆడవారికైనా మగవారికైనా జుట్టు తప్పనిసరిగా ఉండాలి జుట్టు లేకపోతే అందమే కోల్పోతాము. అందుకే జుట్టు పెరగడం పెంచడం కోసం ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇక సాధారణ ప్రజలకు పెళ్లి అయ్యేవరకు జుట్టు ఉంటే సరిపోతుంది అనంతరం ఎలా ఉన్నా పెద్దగా జుట్టు గురించి పట్టించుకోరు కానీ సినిమా సెలబ్రిటీలకు జుట్టు అనేది ఎంతో ముఖ్యమైన విషయం.
సినిమా హీరోలను ప్రేక్షకులు ఆదరించాలని అంటే జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. కనుక హీరోలు జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు జుట్టు సమస్యలతో బాధపడుతూ ప్రతి సినిమాలో విగ్గును ఉపయోగిస్తూ ఉంటారు.మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు విగ్గు వాడుతారు ఎవరిది నిజమైన జుట్టు అనే విషయానికి వస్తే..
సీనియర్ హీరోల నా ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు వారి కెరియర్ ప్రారంభించడంతోనే పౌరాణిక చిత్రాలతో ప్రారంభించారు కనుక వాళ్ళు అప్పట్లో విగ్గు ఉపయోగించారు. అనంతరం కమర్షియల్ చిత్రాల సమయానికి వారికి జుట్టు సమస్య రావడంతో తప్పనిసరిగా విగ్గు వాడారు. వీరితో పాటు కృష్ణంరాజు కృష్ణ వంటి హీరోలు కూడా ప్రతి ఒక్క సినిమాలోను విగ్గు ఉపయోగించిన వారే.అనంతరం చిరంజీవి విషయానికి వస్తే ఆయనకు ఒకానొక సమయం వరకు జుట్టు సమస్య అనేది లేదు తన సినిమాలలో విగ్గు లేకుండా నటించేవారు. అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత జుట్టు సమస్య ఉండడంతో కేవలం సినిమా షూటింగులకు మాత్రమే ఉపయోగించేవారు. ఈయన తరహాలో పవన్ కళ్యాణ్ కూడా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత సినిమా షూటింగ్ లలో మాత్రమే ఉపయోగిస్తున్నారు.
Tollywood Heroes: విగ్గు వాడని ఏకైక హీరో నాగార్జున..
ఇకపోతే బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలు విగ్గు లేనిదే కాలు కూడా బయటకు పెట్టరు. వీరికి జుట్టు సమస్య అధికంగా ఉండడంతో షూటింగ్ ఉన్నా లేకపోయినా విగ్గుకి అలవాటుపడ్డారు.ఇక వెంకటేష్ కూడా ఇదే సమస్యతో బాధపడుతూ విగ్గు పెట్టుకోవడం కన్నా టెక్నాలజీ ఉపయోగించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా పర్మనెంట్ విగ్ ఏర్పాటు చేసుకున్నారు.ఇకపోతే టాలీవుడ్ హీరోలలో విగ్గు ఉపయోగించని ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాగార్జున అని మాత్రమే చెప్పాలి ఈయన ఇప్పటి వరకు కూడా విగ్గు వాడకుండా సొంత జుట్టుతో సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు ప్రతి సినిమాలోను ఉపయోగిస్తారు.ఇక మిగిలిన హీరోలందరూ కూడా వారి పాత్రలకు అనుగుణంగా విగ్గు ధరిస్తూ సినిమాల్లో నటిస్తున్నారు.