Actress Disha Patani డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పటాని. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత్య ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమాకు ఒకే చెప్పలేదు. బాలీవుడ్ కె పరిమితమైన ఈ భామ… అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అందాల భామ. బికినీ అందాలకు దిశా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ‘అంతిమ్’ స్పెషల్ స్క్రీనింగ్ హాజరైన దిశాపటానిని చూసి అందరూ షాక్ అయ్యారు. తన ముక్కుకు, పెదాలకు ఆమె సర్జరీ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. సర్జరీ వికటించడంతో ఆమె ముఖం కాస్త మారిపోయినట్లు కనపడుతోందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువుడ్ సినిమా తారలు సర్జరీలు చేసుకొని ముఖాలన్ని పాడు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దిశా కూడా తన అందమైన ముఖాన్ని సర్జరీతో పాడు చేసుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త టాక్ వినిపిస్తుంది. ఇక పై ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గనున్నాయని అంటున్నారు. సర్జరీ తర్వాత దిశను చూసిన కొందరు దర్శక నిర్మాతలు మనసు మార్చుకుంటున్నారట. కొంతమంది దర్శకులు తమ రాబోయే సినిమాలకు ఈ అమ్మడు వద్దు అని అనుకుంటున్నారట. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గితే తెలుగులో సినిమాలకు ఓకే చెప్పేలా ప్లాన్ చేస్తుందట దిశా. మొత్తానికి సర్జరీ అమ్మడి కెరీర్ పై గట్టి దెబ్బె కొట్టేలా ఉందని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.