TS Congress: రోజు రోజుకు తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య మాటల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. వారి పాలన విషయంలో అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవలే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. రైతుల బాధలను పట్టించుకోండి అంటూ.. అంతే కాకుండా రైతుల రుణమాఫీ ల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఫైర్ అయ్యాడు.
ఇక తాజాగా సర్పంచుల సమస్యలపై రంగం లోకి దిగాడు. ఈ రోజు ఉదయం నుంచి గాంధీ భవన్ వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ‘రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్’ ఆధ్వర్యంలో ధర్నా ను నిర్వహించారు. అయితే ఈ ధర్నా చేపట్టనున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయినప్పటికి రేవంత్ రెడ్డి ధర్నా కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యాడు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా పట్టించుకోరా అంటూ గట్టిగా ప్రశ్నించాడు. అయినా కూడా ఆయన మాటలను పట్టించుకోకుండా పోలీసులు ఆయనను బలవంతంగా తరలించారు.
TS Congress:
ఇక గాంధీభవన్ వద్ద పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇక కాంగ్రెస్ నేతలు ధర్నా చౌక కు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు గేటు దూకేందుకు ప్రయత్నించారు. అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత మారింది. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా తమ ధర్నాను అడ్డగించే ప్రయత్నం చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు.