Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఏదో రకంగా సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఈయన నటించిన ఖుషి సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నా సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినటువంటి అభిమానులకు తాను ఏమి ఇచ్చి రుణం తెలుసుకోగలను అని తెలియజేశారు ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులను ఎంపిక చేసి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పునట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ఇచ్చిన మాటపై విజయ్ దేవరకొండ నిలబడ్డారని తెలుస్తుంది. తాజాగా 100 కుటుంబాలను ఎంపిక చేసే వారందరికీ లక్ష రూపాయలను చెక్కు రూపంలో అందించారు ఈ క్రమంలోనే హైదరాబాదులో ఈ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… నాపై ఇంత ప్రేమానురాగాలు చూపిస్తున్నటువంటి మీకోసం తనకు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఉందనీ తెలిపారు.
ప్రతి ఏడాది సహాయం చేస్తాను..
ఒకప్పుడు నేను కూడా ఇలా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురుచూసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. నేను డిగ్రీ చదువుతున్నాను. నా తమ్ముడు ఇంజనీరింగ్ వెళ్లాలి ఆ సమయంలో లక్ష రూపాయల కోసం నాన్న అమ్మ పడిన ఒత్తిడిని నేను చూశాను. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనిపించింది అలా ఆ స్థాయి నుంచి నేను ఈ స్థాయికి వచ్చాను నేను ఈ స్థాయికి రావడానికి అభిమానులే కారణం అందుకే మీ అందరికీ తాను నేను ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని కోరుకున్నాను. ఇలా ప్రతి ఏడాది తన అభిమానులకు తాను సహాయం చేస్తూనే ఉంటాను సినిమాలు చేసినంతకాలం అభిమానులకు సహాయం అందిస్తూ ఉంటానని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.