Viral : హాయ్ ఐయామ్ మేరీ..ఈ బేబి ఇంట్రడక్షన్ చూడండి..వీడియో హల్‌చల్, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చాలా మంది చిన్నారులను స్కూళ్లకు దూరం చేసింది. మూడు వేవ్స్ తర్వాత చిన్నారులంతా మునుపటిలా పాఠశాలకు వెళ్తున్నారు. అయితే గ్యాప్ ఎక్కువొచ్చింది ..కాబట్టి వారు స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం, తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలనే బెరుకు, భయం చిన్నారుల్లో ఉండటం సహజమే. కానీ ఎలాంటి ఆందోళననైనా చిన్న పాటి ఆలోచనతో దూరం చేసుకోవచ్చని హార్లే మే అనే చిన్నారికి బాగా తెలిసినట్టుంది.
తరగతి గదిలోకి ప్రవేశించే ముందు బేబి హార్లే మే కొంత ప్రాక్టీసు సెషన్ పెట్టుకుంది. అదేంటంటే క్లాస్ రూంలో తనను తాను అందరికీ ఎలా పరిచయం చేసుకోవాలని..డోర్ బయటే ప్రాక్టీస్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో ఒక చిన్న అమ్మాయి తన తరగతి గదిలోకి ప్రవేశించే ముందు తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలో తెలియజేసేలా క్యూట్‌గా సాగుతుంది.
హార్లే మే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. క్యూట్ గా ఉన్న ఈ బేబీ వీడియో మీ ముఖంలో చిరునవ్వును తెప్పించడం ఖాయం. హార్లీ మేకు ఇన్‌స్టాగ్రామ్‌లో 48,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. హార్లీ మేకు డెడికేట్ చేయబడ్డ పేజీ ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంది. హాయ్, నేను హార్లే..అనే క్యాప్షన్ తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. వీడియోలో వచ్చే టెక్స్ట్ వ్యూయర్స్ కు హార్లీ మే ఏం చేస్తుందో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో నెట్టింట అందరి హృదయాలను గెలుచుకుంటుంది.