Viral Video: బుల్లెట్ బండి సాంగ్.. ఈ పాట ఏ ముహూర్తాన విడుదల అయిందో తెలియదు కానీ ఎక్కడ చూసిన కూడా ఈ పాట మార్మోగిపోతోంది. పెళ్లిళ్లలో, చిన్న చిన్న ఫంక్షన్లలో ఎక్కడ చూసిన కూడా ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాట వినిపించింది అంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వారి వయసును మర్చిపోయి మరీ ఈ పాటకు చిందులు వేస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా అయితే పెళ్లిళ్లలో ఈ పాట ఎక్కువగా వినిపిస్తోంది. నవ వధూవరులు ఎక్కువగా ఈ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ మధ్య ఒక సారి కొత్తగా పెళ్లైన జంట ఈ పాటకు డాన్స్ వేసి తెగ వైరల్ అవ్వడంతో అప్పటినుంచి ఏ పెళ్లిలో చూసిన కూడా ఇదే పాటకు స్టెప్పులు వేస్తున్నారు.
అయితే ట్రెండ్ మారింది అన్నట్టుగా పెళ్లి కూతుర్లతోపాటు పెళ్ళి కొడుకులు కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో డాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో జంటలు ఈ పాటకు డాన్స్ వేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించి కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరొక నవ వధూవరుల జంట ఈ పాటకు స్టెప్పులను ఇరగదీశారు. కాకపోతే ఈ వీడియోలో కేవలం పెళ్లికూతురు మాత్రమే ఈ సాంగుకు స్టెప్పులను ఇరగదీసింది.

Viral Video: పెళ్లి కూతురు డాన్స్ కి షాకైన పెళ్ళికొడుకు…
పెళ్లి కూతురు వేసిన మాస్ స్టెప్పులకు షాక్ అయిన పెళ్ళికొడుకు పక్కనే ఉండి చూస్తూ నిలబడిపోయాడు. ఇక పక్కనే ఉన్న కొందరు బంధువులు పెళ్లి కొడుకుని కూడా చేయమని అడగడంతో నేను చేయను అంటూ పక్కకు తప్పుకున్నాడు. పెళ్లి కూతురు డాన్స్ చూసిన ఆ పెళ్ళికొడుకు నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు. ఆ పెళ్లి కూతురు మాత్రం పెళ్ళికొడుకుని ఏమాత్రం పట్టించుకోకుండా డాన్స్ స్టెప్పులను ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ పెళ్లి కూతురు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు నెటిజన్స్ అయితే మీరు కూడా పెళ్లి కూతురుతో జాయిన్ అయి ఉంటే బాగుండేది బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.