Viral Video: ప్రస్తుత కాలంలో మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే శుభకార్యంలో పెద్ద ఎత్తున సంగీత్ కార్యక్రమాలను నిర్వహించడం ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు పెళ్లిళ్లలో సంగీత కార్యక్రమాలను నిర్వహించిన వధూవరుల కుటుంబసభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తూ డ్యాన్సు చేసేవారు.అయితే ప్రస్తుత కాలంలో వధూవరులు అద్భుతంగా డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. ఇక పోతే ఇలాంటి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియో అందరి పెళ్లికూతురు చేసే డాన్స్ కన్నా ఎంతో విభిన్నంగా ఉందని చెప్పాలి. ఈ వీడియోలో పెళ్లికూతురు ఏకంగా యోగ చేస్తున్నట్లు డాన్స్ చేశారు. ప్రస్తుతం పెళ్లి కూతురుకు సంబంధించిన ఈ యోగా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోలో ఈమె చేస్తున్న డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే.
Viral Video: బాబా రాందేవ్ ను తలపిస్తున్న వధువు డాన్స్…
ఈ వీడియోలో పెళ్లికూతురు ఏకంగా బాబా రాందేవ్ లాగా యోగాసనాలను చేస్తు డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు అసలు ఈ వధువు డాన్స్ చేస్తుందా లేక యోగా చేస్తుందా అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె యోగ డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.మరింకెందుకాలస్యం ఈ పెళ్లికూతురు చేస్తున్నటువంటి యోగ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.