Viral Video: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. ఎక్కడ ఏ సంఘటన జరిగిన వెంటనే తెలిసిపోతుంది. క్షణాల్లో ఆ సంఘటనలు వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీ వీడియోలు ఉంటే మరి కొన్ని సీరియస్ వీడియోలు. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలే సీరియస్ గా కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు అనుకోని సంఘటనలు మాత్రమే నెట్టింట్లో భలే వైరల్ అవుతుంటాయి.
ఇప్పటికీ చాలా వీడియోలు బాగా వైరల్ గా మారాయి. ఎక్కువగా ఏదైనా వేడుకల్లో జరిగే సంఘటనలే వైరల్ అవుతుంటాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ని కొట్టడం గానీ లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొట్టడం గానీ చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో వచ్చిన బంధువులతో కూడా గొడవలు పడుతుంటారు. ఆ మధ్య ఓ పెళ్లి వీడియోలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తో సరదాగా ఆటపట్టిస్తూ ఉండగా వెంటనే అతడు ఆమె చెంప మీద గట్టిగా వాయించి అందరికీ షాకిచ్చాడు.
ఇటీవలే ఒక పెళ్లి వీడియోలో ఒకతను తన భార్య ని తీసుకొని వచ్చి డాన్స్ చేస్తుండగా.. అంతలోనే మరో వ్యక్తికి తగలడంతో వెంటనే ఆ వ్యక్తి వచ్చి అతడి చేయి పట్టుకొని బాగా కోపంతో డాన్స్ చేసాడు. ఇక తాజాగా మరో పెళ్లి వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. అందులో పెళ్ళికొడుకు వెనకాల ఒక వ్యక్తి వచ్చి నిల్చోని ఆ పెళ్లి కొడుకును ఊరికే విసిగిస్తూ ఉన్నాడు.

Viral Video: సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు ఇలా చేశాడు..
ఆ తర్వాత ఆ వ్యక్తి పెళ్లి కొడుకు కి చేతిలో డబ్బులు ఇచ్చి అతని బుగ్గలను గట్టిగా గిల్లాడు. దీంతో ఆ పెళ్లి కొడుకుకు సహనం కోల్పోయి వెంటనే ఆ వ్యక్తిని కొట్టాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారటంతో పెళ్లి కొడుకు అయితే మాత్రం విసిగిస్తే ఊరికే ఉంటారా.. పట్టుకొని తంతారు అని కామెంట్లు పెడుతున్నారు.