Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎన్నో జంటలు పెళ్లి బంధంతో ఒకటవుతారు. అయితే ఈ పెళ్ళి సమయంలో ఎంతో మంది బంధువులు అతిథులు కలవడం వల్ల ఎక్కడో ఒకచోట పొరపాట్ల కారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా పెళ్లిళ్లలో జరిగే సంఘటనలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకుని ఈ సమయంలో పెద్ద ఎత్తున ఆటపాటలతో డాన్సులు చేస్తూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.
ఈ విధంగా ఎంతో ఘనంగా పెళ్లి జరిగినప్పటికీ పెళ్లిలో కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చే కానుకలు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇకపోతే వేదికపై పెళ్లి జరుగుతున్న సమయంలో వధూవరుల మధ్య జరుగుతున్న సంఘటనలు కూడా కొందరికి నవ్వు తెప్పించగా మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.పెళ్లి మండపంలో వధూవరులు ఒకరి పై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకోగా మరికొందరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

Viral Video: కోపంతో వధువు పై చేయి చేసుకున్న వరుడు
పెళ్లి మండపంలో వధూవరులిద్దరూ ఎంతో అందంగా ముస్తాబై పెళ్లి తంతు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా వధూవరులు పెళ్లి జరిగిన తర్వాత వరమాల వేసుకుని నోరు తీపి చేసుకోవాలని చెప్పడంతో వధువు వరుడికి స్వీట్ తినిపించాలని చూస్తుంది.వరుడు ఆమె పెట్టిన స్వీట్ తినడానికి నిరాకరిస్తూ ఏదో బలవంతంగా తింటాడు. ఇక తదుపరి వరుడు సైతం వధువుపై కోపంతో బలవంతంగా తన నోటి నిండ స్వీట్ కుక్కతాడు. దీంతో వధువుకు చాలా కోపం వచ్చింది. ఒక్కసారిగా వరుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన చెంప చెల్లుమనిపించింది.వరుడు సైతం తగ్గేదేలే అన్నట్టు వధువు చెంప చెల్లుమనిపించాడట.ఇలా వీరిద్దరు వేదికపై కొట్టుకోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు అతిథులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.