Viral Video: ఈ మధ్యకాలంలో ఏ వేడుక జరిగినా తప్పకుండా బంధు మిత్రులందరికీ ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నారు.చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా పెద్ద ఎత్తున బంధుమిత్రుల సందడి చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో ట్రెండింగ్ ఉన్న పాటలకు డ్యాన్సులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలా రోజు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఏదైనా మాస్ సాంగ్ వినబడితే చాలు మనకు తెలియకుండా మన శరీరంలో కదలికలు ఏర్పడతాయి. డాన్స్ రాకపోయినా కాలు కలపడం చేస్తుంటాము. ఇక డాన్స్ వచ్చిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాట వింటేనే వారిలో తెలియని ఊపు వస్తూ డాన్స్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుకలో భాగంగా పాటలు పెట్టుకుని బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తనకు ఇష్టమైన పాట రావడంతో ఏకంగా వేదిక పైకి వెళ్లి ఓ రేంజ్ లో డాన్స్ చేశారు.

Viral Video: అద్భుతమైన పర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు…
ఈ విధంగా ఆ మహిళ చేసిన అద్భుతమైన స్టెప్పులకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ వీడియోకి వ్యూస్ రావడమే కాకుండా, ఈ వీడియో పై లైక్స్ కామెంట్ల వర్షం కూడా కురుస్తుంది. ఇద్దరు మహిళలు కలిసి వేదికపై చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.