Rashmika: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రష్మిక ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా హీరో కం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి రెండు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో గీతా గోవిందం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తదుపరి చిత్రాన్నిలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక నటించిన తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ ఈ సినిమాలో రష్మిక లిల్లి అనే పాత్రలు నటించారు. అయితే ఈ సినిమాలో రష్మిక మొదటి ఆప్షన్ కాదని వేరే హీరోయిన్ ఈ సినిమా అవకాశాన్ని వదులుకుంటేనే రష్మిక ఈ సినిమాలో భాగమైంది అని తెలుస్తుంది. మరి డియర్ కామ్రేడ్ సినిమా వదులుకున్నటువంటి హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..
లిప్ లాక్ సీన్స్ కారణమా…
చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో నటించడం కోసం ముందుగా నటి సాయి పల్లవిని సంప్రదించారట అయితే సాయి పల్లవి మాత్రం ఈ సినిమాలో తాను నటించమని చెప్పడంతో అవకాశం రష్మికకు వచ్చింది. అయితే సాయి పల్లవి ఇందులో లిప్ లాక్ సన్నివేశాలు ఉండడం రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య వచ్చినటువంటి లిప్ లాక్ సీన్స్ చాలా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తల్లో కూడా పుట్టుకొచ్చాయి. అంతలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో వర్కౌట్ అయిందని తెలుస్తోంది.