మన దేశంలో క్రికెట్ కు క్రేజ్ ఉన్న క్రేజ్ ఎంతటిదో మనకు తెలిసిందే. అన్ని దేశాలలో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత వీరాభిమానులు ఉన్నారు. అసలు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను ఫాలో అవుతారు. ఎంజాయ్ చేస్తారు. అందుకే రోజురోజుకు క్రికెట్ క్రేజ్ పెరిగిపోతోందే తప్ప తగ్గడం లేదు. అంతలా క్రికెట్ కు క్రీడా ప్రేమికులకు మధ్య పెనవేసుకు పోయింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. ఒక క్రీడాకారునికి ఆట ద్వారా గుర్తింపు వస్తుంది. కాని తన ఆట ద్వారానే క్రికెట్ కు వన్నె తెచ్చిన క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. సచిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనేలా ఒక క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప క్రీదాకారుడిగా నిలిచిపోయాడు. తన ఆట తీరుతో భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాలలో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్.

మ్యాచ్ కు సన్నద్దమయ్యే ముందు రోజు టెన్షన్ గా ఉండేది

ఇక తన ఆట తీరుతీరుతోనే కాక తన గొప్ప వ్యక్తిత్వంతో కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే నేడు హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా తాను హైపర్ టెన్షన్ కు గురైన సందర్భాల గురించి చెప్పుకొచ్చాడు. నా కెరీర్ లో సగం రోజులు టెన్షన్ తోనే గడిపానని, మ్యాచ్ ఆడబోయే ఒకరోజు ముందు మ్యాచ్ కు సంబంధించి మొత్తం ఎలా ఆడాలనే విషయాన్ని ఊహించుకొని సన్నద్ధమయ్యే వాడినని, దీంతో రేపు మ్యాచ్ ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యే వాడినని సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే కొన్నేళ్ల తరువాత టెన్షన్ అనిపించినప్పుడల్లా షాడో బ్యాటింగ్ ఆడటం వలన, వీడియో గేమ్స్ ఆడటం వలన టెన్షన్ నుండి కొంచెం రిలీఫ్ పొందే వాడినని, మ్యాచ్ కు ముందు రోజు నా కిట్ బ్యాగ్ ను నేనే సర్దుకుంటూ, నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ కొంచెం పనులపై ధ్యాస మల్లించుకొని టెన్షన్ నుండి రిలీఫ్ పొందడానికి ప్రయత్నించే వాడినని సచిన్ తన చీకటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 17, 2021 at 3:04 సా.