మన దేశంలో ఎక్కువ ప్రజాదరణ ఉండే వారు ఎవరైనా ఉన్నారంటే వారు ఒకరు రాజకీయ నాయకులైతే ఇంకొకరు సినిమా నటులు. అయితే రాజకీయ నటులకంటే సినిమా నటులకు ఉండే క్రేజ్ ఎక్కువ. అయితే సినిమా నటుల ఆదాయం కోట్లలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే సినిమాల ద్వారానే కాకుండా రకరకాల విధాలుగా నటులు ఆదాయాన్ని ఆర్జిస్తారు. అవి ఏంటంటే యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల ద్వారా. ఒక సినిమాకు ఎంతయితే ఆర్జిస్తారో అందులో యాభై శాతం ఆదాయాన్ని యాడ్స్ ద్వారానే నటులు ఆర్జిస్తారు. కానీ అందరూ యాడ్స్ వైపు మొగ్గు చూపరు. ఎందుకంటే కొన్ని యాడ్స్ లలో నటించడం వల్ల కొంత తమకు నష్టం కలుగుతుందన్న భావనలో కొంత మంది నటించడానికి ఇష్టపడరనేది మనకు తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వెండి తెర ప్రేక్షకుడు ఉండరనే విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు బాల నటుడిగా తండ్రి సరసన నటించి మెప్పించి తరువాత చదువు అనంతరం రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ సినిమా కొంత మహేష్ ను నిరాశపర్చినా ఇకఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.
మహేష్ ను ఈ విషయంలో ఒప్పించిన నమ్రత
ఇక పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ తో మాస్ హీరోగా మారిపోయిన మహేష్ బాబు ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా తరువాత సక్సెస్ ట్రాక్ మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇక ఇటు సినిమాలు ఎంత వేగంగా చేస్తారో అంతే వేగంగా యాడ్స్ లో కూడా నటిస్తుంటారు మహేష్ బాబు. ఇక తాజాగా సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థ యాడ్ కోసం మహేష్ ని సంప్రదించింది. అయితే మొదటగా వారు మహేష్ బాబు భార్య నమ్రతను సంప్రదించి ఫ్యామిలీ యాడ్ కోసం కొరినట్టు తెలిసింది. అయితే మొదట ఫ్యామిలీ యాడ్ కోసం నమ్రత అంగీకరించకపోయినా తరువాత సంస్థ వారు చెప్పిన విధానాన్ని బట్టి నమ్రత అంగీకరించి మహేష్ బాబును కూడా ఒప్పించింది. అయితే చివరికి అంగీకరించిన మహేష్ బాబు ఈ యాడ్ షూటింగ్ లో ఫ్యామిలీ అంతా పాల్గొని 4 గంటలలో యాడ్ ను పూర్తిగా చిత్రీకరించారట. అయితే ఈ ఒక్క యాడ్ కోసం ఏకంగా ఆ సదరు సంస్థ నుండి 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.