నటి తాప్సీ వెండి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలలో నటించినా తెలుగులో తరువాత చేసిన సినిమాలేవీ విజయం సాధించకపోవడంతో ఇక బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇక అక్కడ అదృష్టం కలిసి రావడంతో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి వారి సరసన నటించి బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని నటిగా తనకు తానుగా నిరూపించుకుంటూ ముందుకెళ్తోంది నటి తాప్సీ. అయితే ఇక బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న తాప్సీ ఇప్పటివరకు టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించడం లేదు. ఇక తాప్సీ అందరి హీరోయిన్ లలా గ్లామర్ పాత్రలను ఎంచుకోకుండా నటనా ప్రాధాన్యత పాత్రలను ఎంచుకుంటూ నటిగా సత్తా చాటాలని మాత్రమే ప్రయత్నిస్తున్నట్టుగా తాప్సీ సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలను బట్టి మనకు అర్ధమవుతోంది. అయితే నటిగా ఎంతటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నదో, ఇటు తన డ్రెస్సింగ్ స్టైల్ లోనూ విభిన్నతను చూపిస్తూ తన కంటూ తాప్సీ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా తాప్సీ ధరించిన చీర ఖరీదు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

లైఫ్ స్టైల్ లో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: నటి తాప్సీ 

సెలెబ్రెటీలు అందరూ సాధారణ వ్యక్తులు ధరించిన వస్త్రాలు ధరించడానికి ఎక్కువగా ఇష్టపడరు. వారికి సమాజంలో ఉన్న గుర్తింపు ఆధారంగా అంతేకాక తమ తోటి సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ ను బట్టి బ్రాండ్ వస్త్ర ధారణకు అలవాటు పడుతుంటారు. అటువంటి వాటికే ప్రాధాన్యత కూడా ఇస్తుంటారు. అయితే తాప్సీ ధరించే బ్రాండ్  ఆప్రో. ఇది చాలా అరుదైన బ్రాండ్ లలో ఒకటి. అయితే తాప్సీ తన బ్రాండ్ డబ్ల్యూసీడబ్ల్యూసీ అని చెబుతోంది తాప్సీ. అయితే తాప్సీ ధరించిన చీర ఖరీదు 15,500 గా తెలుస్తోంది. మనలో మనకు కాన్ఫిడెన్స్ రావడానికి డ్రెస్సింగ్ స్టైల్ కూడా ముఖ్యమని తాప్సీ చెబుతోంది. మనకు సమాజం మనకు డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా కూడా ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తారని కావున ఎవరికి నచ్చిన రీతిలో వారు డ్రెస్సింగ్ స్టైల్ లో, లైఫ్ స్టైల్ లో కూడా ప్రత్యేకంగా ఉండేలా తమను తాము మార్చుకోవాలని తాప్సీ అభిమానులకు సూచిస్తోంది. ఎప్పుడూ కూడా అత్యుత్తమ కాన్ఫిడెన్స్ గల వ్యక్తులుగా మాత్రమే సమాజంలో గుర్తింపు పొందాలని నటి తాప్సీ తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 18, 2021 at 7:37 సా.