Yashika : హీరోయిన్ కావాలని పదహారేళ్ళ వయసు లోనే ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీ కి వచ్చింది తమిళ బ్యూటీ యాషిక ఆనంద్. కానీ ఈ అమ్మడికి హీరోయిన్గా అవకాశాలు రాలేదు. అయితే ఆ మధ్య బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకొని తన ప్రతిభను నిరూపించుకోవడానికి తో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. దీనికి తోడు నటి అర్చన ఆనంద సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా అప్పుడప్పుడు ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ని పెంచుకుంటోంది. అయితే ఆ మధ్య జరిగిన ఓ కారు ప్రమాదం కారణంగా హాస్పిటల్ పాలైన ఈ బ్యూటీ మళ్ళీ పూర్తిగా కోలుకొని సినిమా ఇండస్ట్రీ పై దృష్టి సారించింది.
దీంతో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు అలాగే సినిమా సంబంధిత సమాచారం కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా ఈ అమ్మడు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లు అధికారికంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నెటిజన్లలో పంచుకుంది.

ఇందులో భాగంగా తన తల్లిదండ్రులు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కి ఒప్పుకున్నారని అలాగే పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో కచ్చితంగా నటిస్తానని స్పష్టం చేసింది. ఇప్పటి లాగే ఎప్పటికీ తనని ఆదరించాలని ప్రేక్షకులను కోరింది. కానీ నీ తాను పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరనే విషయాన్ని మాత్రం యాషిక ఆనంద్ బయట పెట్టలేదు. దీంతో కొందరు నెటిజన్లు నటి యాషిక ఆనంద్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి యక్షగానం మలయాళం మరియు తమిళం భాషలో దాదాపుగా 8 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది అంతే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి ఓకే చెబుతోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఏదేమైనప్పటికీ చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన యాషిక ఆనంద్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈ సమయంలో యాషిక ఆనంద్ పెళ్లి చేసుకుంటే మళ్లీ కెరియర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.