Multivitamin Tablets: మన శరీరానికి విటమిన్లు ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు తగ్గితే మల్టీవిటమిన్‌ మాత్రలను వైద్యులు సూచిస్తారు. ఇవి శరీరానికి కావాల్సిన పోషణకు, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే.. ఇది డాక్టర్ సూచన మేరకే వాడాల్సి ఉంటుంది.

కరోనా వైరస్‌ కట్టడిలో మల్టీవిటమిన్ల పాత్ర ఎంత?
అయితే నూతనంగా కరోనా వైరస్‌ నివారణలో మల్టీవిటమిన్లు కీలకపాత్ర వహిస్తున్నాయని కొందరు అంటున్నారు. అలాంటి మల్టీవిటమిన్‌ టాబ్లెట్లలో ఒకటి జింకోవిట్. జింకోవిట్‌ అనేది మల్టీ విటమిన్, మల్టీ మినలర్ టాబ్లెట్. ఇది కరోనా వైరస్ రాకుండా పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు గానీ… ఇది వాడితే… మనిషిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా లాంటి వైరస్‌లు దాడిచేసేటప్పుడు… దానిని అడ్డుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పుతుందంటున్నారు కొందరు వైద్యులు.

జింకోవిట్‌ వల్ల లాభాలు:

జింకోవిట్‌లోని విటమిన్ A, విటమిన్ Cలు… కణాలను రిపేర్ చేసి… కణజాలాన్ని మెరుగుపరుస్తున్నాయి. శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్న వారు ఈ టాబ్లెట్లను వాడతారు. గుండె సమస్యలు, డయాబెటిక్, టీబీ, రూమాటిక్ పేషెంట్లను ఈ టాబ్లెట్లు వాడమని చెబుతారు.

జింకోవిట్ వల్ల ప్రయోజనాలు :
– ఈ టాబ్లెట్ ఆకలిని పెంచుతుంది.
– బాడీలో విటమిన్లు, జింక్ లోపాల్ని సరిచేస్తుంది.
– ప్రెగ్నెన్సీ, సర్జరీ సమయంలో మహిళలకు మేలుచేస్తుంది.
– బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే సరిచేస్తుంది.
– రకరకాల వ్యాధులు రాకుండా అడ్డకుంటుంది.
– ఆల్రెడీ ఉన్న వ్యాధులు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ కారణంగానే జింక్ టాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. ఓవైపు పౌష్టికాహారం తీంటూనే… మరోవైపు జింకోవిట్ టాబ్లెట్లను కూడా ప్రజలు వాడుతున్నారు. తద్వారా తమకు కరోనా సోకదనే ధైర్యం వారిలో కనిపిస్తోంది.

ఎంతమోతాదులో వీటిని తీసుకోవాలి:

అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు సొంతంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు ఉంటాయన్నది కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం.
రోజుకు 100 గ్రాముల మోతాదు వరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ మోతాదు మించితే నాడులు డ్యామేజ్ అవుతాయన్నది కొందరు శాస్తవేత్తలు, వైద్యుల అభిప్రాయం.

మల్టీవిటమిన్‌ టాబ్లెట్ల వల్ల నష్టాలు

వీటిని అధిక మోతాదులో తీసుకుంటే చర్మ వ్యాధులు, అసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే.. వీటి బదులు చేపలు, ఆలుగడ్డలు, అవకాడోలు, పిస్తా పప్పు తింటే సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ట్యాబెట్లు అతిగా తీసుకుంటే.. ఉన్న సమస్యను నివారించాల్సింది పోయి మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 17, 2021 at 11:15 సా.