Amyotrophic Lateral Sclerosis : అమాయోట్రోఫీక్ లేటరల్ స్కలేరోసిస్( ఏ ల్ స్ ) వ్యాధి గురించి మీకు తెలుసా….?

S R

Amyotrophic Lateral Sclerosis ఏ ల్ స్ ( అమాయోట్రోఫీక్ లేటరల్ స్కలేరోసిస్ )ఇది ఒక అరుదైన జబ్బు, దీనిని “లూ గేహరిగ్స్ ” అని కూడా అంటారు.మన భారత దేశం లో సంవత్సరానికి సగటున 100 వేల కంటే తక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.ఇది నరాలకు సంబంధించిన ఒక వ్యాధి.  దీనిని మోటార్ న్యూరాన్ వ్యాధి అని కూడా అంటారు, ఎందుకంటే మెదడులో ఇంకా వెన్నుముక్క లో  మనకి మోటర్ న్యూరాన్స్ ఉంటాయి. మన నర్వస్ సిస్టమ్ ఈ మోటార్ న్యూరాన్ వల్లనే పనిచేస్తాయి. ఈ మోటార్ న్యూరాన్ సరిగ్గా పని చేయ్యకపోతే ఈ జబ్బు రావడానికి ఆస్కారం అవుతుంది.

ఈ (ఏ ఎల్ ఎస్) నాడీ కణాల మీద ప్రభావం చూపిస్తుంది దానివల్ల స్వచ్ఛంద కండరాలు పని చెయ్యకుండా చేస్తుంది. స్వచ్ఛంద కండరాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం నడవటానికి, మాట్లాడటానికి, ఆలోచించటానికి, ఆహారం తినటానికి, ఈ నాడీ కణాలు మోటార్ న్యూరాన్ కి మెసేజ్ ఇవ్వటం వల్ల మనం ఆ పనులన్నీ చేయగలం, ఈ మోటార్ న్యూరాన్ మెదడు నుంచి వెన్నముక్క వరకు ఉంటాయి. ఈ వ్యాధి రావడం వల్ల ఆ కణాలు మరియు కండరాలు, నెమ్మది నెమ్మదిగా రోగం పెరిగేకొద్దీ  నాశనం చేసి ఆయా కణాలను మరియు కండరాలను చంపేస్తుంది.

Amyotrophic Lateral Sclerosis ఈ వ్యాధి రావడానికి కారణాలు…..

ఈ జబ్బు 5% నుంచి 10% వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది.

వయసు పెరిగే కొద్ది కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది 40 నుంచి 60 వయసులో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంది.

65 ఏళ్ల వయస్సులో ఈ జబ్బు ఆడ వారి కంటే మగవాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, 70 ఏళ్లకు కు అన్ని లింగాలకు సమానంగా ఈ జబ్బు రావచ్చు.

వాతావరణం కాలుష్యం వల్ల కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది.

ఈ జబ్బు యొక్క లక్షణాలు….

 • కాలు,చీలమండ, ల బలహీనత,తట్టుకోని పడిపోవటం,మెట్లు ఎక్క లేకపోవటం.
 • మాటలు తడబడట్టం,పోను పొను ఆహరం మింగుడు పడకపోవడం.
 • చేతి వెళ్ళలో బలం లేకపోవడం , అంటే వస్తువును పట్టుకోవడానికి పట్టు లేకపోవుట్ట.
 • కండరాల నొప్పులు, కండరాలు పట్టుకున్నట్టు అంటే తిమ్మిర్లు పట్టినట్టు  అనిపించడం.
 • బరువు తగ్గటం, క్రమంగా చేతులు మరియు కాళ్ళ కండరాలు తగ్గిపోవటం.
 • ఏడుపుని అదుపు చెయ్యలేక పోవటం , అనవసరమైన విషయంలో నవ్వటం.
 • అస్పష్టంగా మాట్లాడటం.
 • వ్యాధి ముదిరే కొద్దీ శ్వాస తీసుకోలేక పోవటం, అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతినట్టo జరుగుతుంది.

ఏ ఎల్ ఎస్ ను నిర్ధారించే వైద్య పరీక్షలు :

 • నాడీ కండరాల వ్యాధుల చర్యలను పరీక్షించడానికి ‘ఈ ఎం జి’   ( ఎలక్ట్రోమీ యోగ్రామ్ )
 • (ఇంపల్స్ ట్రాన్సమిషన్ ) నరాల ప్రసరణ, కండరాల వ్యాధులను తెలుసుకునే పరీక్ష.
 • వెన్న ముక్క లేదా హెర్నియాటెడ్ డిస్కులలో కాణితులని పరిశీలించడానికి ( ఎమ్ .ఆర్.ఐ )
 • మూత్రం లేదా రక్త పరీక్షలు.
 • లుంబార్ పుంక్చర్ అనె పరీక్ష : సెరిబ్రోస్పైనల్ ద్రవాన్ని వెన్నముక్క నుంచి తీసుకుని పరీక్ష చేస్తారు.
 • బయాప్సీ : కండరాల జీవకణాలను పరీక్షించడం.

పైన తెలిపిన వైద్య పరీక్షలతో ద్వారా ఏ ఎల్ ఎస్ ను పరీక్షిస్తారు.

ఈ జబ్బు కు వాడే మందులు :

ఈ వ్యాధిని నిర్మూలించటానికి ఎలాంటి చికిత్స లేదు, ఈ వ్యాధి వస్తే 3 నుండి 10 సంవత్సరముల వరకు బ్రతకగలరు.

రెండు ముఖ్యమైన మందులు ఈ జబ్బు వచ్చిన వారి జీవితకాలాన్ని పెంచటానికి మాత్రమే ఉపయోగపడతాయి, వ్యాధిని నిర్మూలించటానికి కాదు.

రోజువారి పనులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి (ఎడారావోన్) శ్వాస సంబంధించిన ఇబ్బందుల నుంచి మరియు కండరాల వాపులకు ఈ మందును ఉపయోగిస్తారు.

(రిలుజోల్) ఈ మందు కాలేయ సమస్యలను,గ్యాస్ట్రిక్ సమస్య, మైకమనొప్పులు, మలబద్ధకం, నిద్రలేమి తనం, అలసట, నీరసం, నోటిలో  లాలాజలం తగ్గించటానికి,గ్లూటామేట్ స్థాయిని  తగ్గించటానికి మరియు ఆలస్యంగా వ్యాధి పురోగమించడానికి ఈ మందు ని సూచిస్తారు.

చికిత్సలు:

 1. ఫిజికల్ థెరపీ.
 2. ఆక్యుపేషనల్ థెరపీ.
 3. స్పీచ్ థెరపీ.
 4. హెల్తీ డైట్ మరియు న్యూట్రిషన్ల్ ఆహారం.

ఈ మధ్య ఈ వ్యాధి గురించి అందరిలో అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ చాలెంజ్ ని కూడానిర్వహింకాదాం జరిగింది.

- Advertisement -