brown eggs or white eggs which are nutritious
brown eggs or white eggs which are nutritious

ఆదివారమైనా.. సోమవారమైనా.. రోజూ తినండి గుడ్డు అని అన్నారు పెద్దలు. అంటే.. రోజూ ఒక గుడ్డును తినాలి అన్నమాట. ఉడకబెట్టిన గుడ్డు అయితే మరీ మంచిది. గుడ్డును కంప్లీట్ ఫుడ్ అంటారు. ఎందుకంటే.. గుడ్డులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ ను అందిస్తాయి. అందుకే.. పిల్లలకు కూడా ఎక్కువగా గుడ్డును పెడుతుంటారు. అసలు గుడ్లను తినని వాళ్లు ఉండరు. శాఖాహారి అయినా మాంసాహారి అయినా ఎవ్వరైనా గుడ్డును మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. గుడ్డుతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఒక్క ఉడకబెట్టడమే కాదు.. ఆమ్లెట్ వేసుకొని, ఎగ్ బుర్జీ చేసుకొని.. ఎగ్ కర్రీ చేసుకొని.. ఇలా ఎగ్ ను రకరకాలుగా వండుకొని తింటుంటాం మనం.

brown eggs or white eggs which are nutritious
brown eggs or white eggs which are nutritious

గుడ్డులో కూడా రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల కోడి గుడ్డు.. ఇంకోటి నాటుకోడి గుడ్డు. ఇంకా బాతు గుడ్లు, ఇతర పక్షుల గుడ్లు కూడా ఉంటాయి కానీ.. మనం ఎక్కువగా తినేది తెల్లకోడి గుడ్లు, నాటు కోడి గుడ్లు. నాటు కోడి గుడ్లనే మనం బ్రౌన్ ఎగ్స్ అని కూడా అంటుంటాం. బాతు గుడ్లు కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి కానీ.. అవి కొంచెం పెద్దవిగా ఉంటాయి. మనకు మార్కెట్ లో దొరికే గుడ్లు తెల్లవి. అవి ఫారం కోళ్లు పెట్టే గుడ్లు. వాటినే ఎక్కువగా తింటుంటాం. అయితే.. చాలామంది తెల్ల కోడి గుడ్ల కన్నా కూడా నాటు కోడి గుడ్లు ఆరోగ్యానికి మంచివి అని చెబుతుంటారు. అందులోనూ నాటుకోడి గుడ్ల రేటు కూడా ఎక్కువే. అందులోనూ నాటుకోడి పెట్టిన గుడ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అని కూడా అనుకుంటాం. కానీ.. అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం రండి.

ఈ రెండు రకాల గుడ్లపై రీసెర్చ్ చేయగా తేలిందేంటంటే?

ఈ రెండు రకాల గుడ్లను పరిశోధకలు.. రీసెర్చ్ చేశారు. అయితే.. వాళ్ల పరిశోధనలో తేలింది ఏంటంటే.. రెండు రకాల గుడ్లలో కూడా పోషకాలు సేమ్ ఉన్నాయట. ఏ గుడ్డులో తక్కువ.. మరో గుడ్డులో ఎక్కువ లేవట. వాటిలో ఉన్న తేడాలు ఏంటంటే.. ఒకటి రంగు.. ఎందుకంటే.. ఒకటి తెల్లగా.. ఇంకోటి బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా. అలాగే.. టేస్ట్ విషయంలో కొంచెం తేడా ఉంటుందట. తెల్లకోడి గుడ్డు పచ్చ సొన కంటే కూడా నాటు కోడి గుడ్డు పచ్చ సొన టేస్ట్ గా ఉంటుంది. అంతే తప్పితే.. ఈ రెండు కోడి గుడ్లలో ఏ గుడ్డును వాడినా.. శరీరానికి అందే పోషకాలు మాత్రం సేమ్ అట. కాకపోతే.. నాటు కోడి గుడ్డులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయట అంతే. సైజ్ లోనూ రెండు రకాల గుడ్లు సేమ్ ఉంటాయి. కాకపోతే ముందు చెప్పుకున్నట్టుగా నాటు కోడి గుడ్ల రేట్లు ఎక్కువ, వాటి ఉత్పత్తి కూడా తక్కువ. మార్కెట్ లో నాటుకోడి గుడ్లు అరుదుగా దొరుకుతాయి. కానీ.. తెల్ల కోడి గుడ్లు మాత్రం మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతాయి. చాలామంది వాడే గుడ్లు కూడా అవే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 31, 2021 at 8:01 సా.