Corona Effect On Pregnant Lady: కరోనా సాధారణ మహిళలకంటే గర్భణిలకే ఎక్కువగా సోకుంతుందా? ఒకవేల గర్భణికి కరోనా సోకితే పుట్టబోయే బి‌డ్డకు ఏమైనా ప్రమాదం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. గర్భిణీలకే ఎందుకు ఎక్కువగా కరోనా సోకుంతుంది ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కావాలా అయితే ఈ కథనం చదివెయ్యండి.

ఇటీవలె కాలంలో గర్భిణీలు ఎక్కువగా వైరస్ భారిన పడుతుండటం చూస్తున్నాం. మహిళల కంటే గర్భిణీలు కరోనా సంక్రమణకు గురయ్యే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గర్భంలోని శిశువుపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళనతో.. కాబోయే తల్లులు దిగులుపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గి… రెమిడిసివర్ లాంటి మందులు వాడిన వారి మానసిక స్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. వైరస్ సోకినప్పుడు వాడే మందులు పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆందోళన గర్భిణీలు ఎదుర్కొంటున్నారు. అయితే గర్భిణీలకు కరోనా సోకినా ఎటువంచి ప్రమాదం ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు వైద్యుల తెలుపుతున్నారు.

కరోనా సోకకుండా ఉండాలంటే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇంటి నుంచి ఎంతో అవసరం అయితే, తప్ప బయటకు రాకూడదు. అదేవిధంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి దగ్గరలోకి వెళ్ళకూడదు. అత్యవసరం అయితే తప్ప ఆసుపత్రికి వెళ్లకపోవడం మంచిది. ఎప్పుడూ దగ్గరలో ఆక్సిమీటర్, పల్స్ మీటర్, థర్మామీటర్ ఉంచుకోవాలి. వాటితో పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన తనిఖీలు మరియు పరీక్షలు జరిగేలా చూసుకోండి. జలుబు, జ్వరం కోసం కొన్ని మందులను డాక్టర్ సలహా మేరకు మీ వద్ద ఉంచుకోండి. ఎప్పటికప్పుడు, గైనకాలజిస్ట్‌ను ఫోన్‌లో సంప్రదించండి. మీకు రక్తపోటు, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధి ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోండి, క్రమం తప్పకుండా యోగా, నడక చేయండి.

గర్భిణీలు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా..?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన నివేదికలో గర్భిణీ స్త్రీలలో వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవని తెలిపింది.

గర్భిణీలకు కరోనా సోకినా భయపడాల్సిన పనిలేదు. పుట్టబోయే బిడ్డపై కరోనా తీవ్ర ప్రభావం ఉండదు. గర్భిణీలు వ్యాక్సిన్‌ వేసుకోకూడదనే వార్తలు అసత్యం. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భిణీలకు మేలే జరుగుతోంది. గర్భిణీలకు జ్వరం మాత్రం ప్రమాదమే, వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భౌతికదూరం, రెండు మాస్క్‌లు వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలకు నెగటివ్‌ వచ్చి లక్షణాలుంటే మరోసారి టెస్టు చేసుకోవాలి. అజిత్రోమైసిన్‌, రెమిడెసివిర్‌తో గర్భిణీలకు ప్రమాదమేం లేదని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్ మంజుల అనగాని తెలిపారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 19, 2021 at 12:02 ఉద.