cauliflower health benefits telugu
cauliflower health benefits telugu

Cauliflower : కాలిఫ్లవర్ తెలుసు కదా. చూడటానికి పువ్వులా ఉంటుంది. అందుకు దాని కాలిఫ్లవర్ అంటారు. అయితే.. కాలిఫ్లవర్ కూడా ఒక కూరగాయే. దాన్ని కూడా చాలామంది తింటారు. కాకపోతే కొందరు దాన్ని తినడానికి భయపడతారు. ఎందుకంటే.. అందులో తెల్లటి పురుగులు ఉంటాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. అందుకే.. కాలిఫ్లవర్ అనగానే చాలామంది వద్దు బాబోయ్ అంటారు. కానీ.. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. అసలు కాలిఫ్లవర్ లో ఎటువంటి పురుగులు ఉండవు. అదంతా భ్రమ, అపోహ. ఏదైనా చెడిపోయిన దాంట్లో ఉంటే ఉండొచ్చు కానీ.. మంచిగా ఉన్న కాలిఫ్లవర్ లో పురుగులు ఉండవు. అంతే కాదు.. కాలిఫ్లవర్ ను ఎవ్వరైనా తినొచ్చు. దాన్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

cauliflower health benefits telugu
cauliflower health benefits telugu

కాలిఫ్లవర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాన్నే పీచు పదార్థాలు అంటాం మనం. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అదే శరీరానికి మంచిది. పిండి పదార్థాలు అంటే కార్బొ హైడ్రేట్స్ తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటేనే మనకు మంచిది. కాలిఫ్లవర్ లో ఎక్కువ ఫైబర్, తక్కువ కార్బొహైడ్రేట్స్ ఉండటం వల్ల.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాలిఫ్లవర్ విటమిన్ సీ, కే, బీ6 తో పాటు.. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్ లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

Cauliflower : కాలిఫ్లవర్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే.. షుగర్ పరార్

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న వ్యాధి షుగర్. దాన్నే డయాబెటిస్ అని కూడా అంటాం. ఇది మన దరికి చేరకుండా ఉండాలంటే.. క్రమం తప్పకుండా కాలిఫ్లవర్ ను తీసుకోవాలి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్.. షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా.. దాని కణాలను అడ్డుకుంటుంది. జీర్ణవ్యవస్థను కాలిఫ్లవర్ మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

బరువు తగ్గాలనుకునేవాళ్లకు కూడా కాలిఫ్లవర్ దివ్యౌషధం. ఇందులో ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి.. బరువు తగ్గడం కోసం దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. కాలిఫ్లవర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్ రాకుండా కాపాడటమే కాకుండా.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తాయి. లివర్ ను శుభ్రం చేస్తుంది. శరీరంలోని కణాలను కాలిఫ్లవర్ లో ఉన్న కోలిన్ అనే పదార్థం శక్తిని అందజేస్తుంది. శరీరం మెటబాలిజం రేటును పెంచుతుంది. రక్త నాళాలు అరోగ్యంగా ఉండేలా చూస్తుంది. చూశారు కదా.. ఒక్క కాలిఫ్లవర్ లో ఎన్ని సుగుణాలు ఉన్నాయో. కాలిఫ్లవర్ ను తినకపోవడం వల్ల.. ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మిస్సవుతున్నారో అర్థం అయింది కదా. అందుకే.. తరుచుగా అయినా కాలిప్లవర్ ను తినండి. మీకే మంచిది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 1, 2021 at 8:51 ఉద.