crying is good for health
crying is good for health

Cry : ఎవరైనా ఏడిస్తే.. వద్దురా బాబు.. ఏడ్వకు.. మంచిది కాదు అంటారు పెద్దలు. ఏడిస్తే.. అది చెడుకు సంకేతం అంటారు. నవ్వితే మంచికి సంకేతం అంటారు. అందుకే.. నవ్వడం యోగం.. ఏడ్వడం రోగం అంటారు పెద్దలు. కానీ.. చాలామందకి తెలియని విషయం ఏంటంటే.. నవ్వితేనే కాదు.. ఏడిస్తే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నవ్వడం ఆరోగ్యానికి మంచిది అని అందరూ చెబుతారు కానీ.. ఏడిస్తే కూడా ఆరోగ్యానికి మంచిదే అని ఎవ్వరూ చెప్పరు. అందుకే.. ఏడ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి. మీకు ఇప్పుడు ఆ విషయం తెలిస్తే.. వెంటనే ఏడ్చేస్తారు.

crying is good for health
crying is good for health

అయితే.. ఏడ్చే మొహం చూసి చాలామంది భయపడతారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చేవాళ్లను కూడా చూసి జనాలు పట్టించుకోరు. ఎహె.. వాడు ఏడుపు మొహపోడు.. అంటూ తిడుతుంటారు. కానీ.. ఏడ్వడం వల్ల.. అతడి ఆరోగ్యం బాగుంటుందనే విషయం వాళ్లకు తెలియదు. ఇప్పటి వరకు ఏడ్వని వాళ్లు ఉన్నారంటే.. వాళ్లే కోరి మరీ అనారోగ్యం పాలు అవుతున్నట్టు లెక్క.

Cry : ఏడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఎవరైనా సరే.. ఏడవగానే.. ముందుగా కళ్ల నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. కళ్ల నుంచి వచ్చే కన్నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. అంటే.. కన్నీళ్లు మన శరీరంలో ఉన్న వేడిని కన్నీళ్ల ద్వారా బయటికి పంపిస్తాయన్నమాట. మీరు ఏడవడం వల్ల.. మీ శరరీంలోని వేడి తగ్గుతుంది. అలాగే.. కళ్లలో ఉన్న దుమ్ము, దూళి.. కన్నీళ్ల ద్వారా బయటికి వెళ్లిపోతుంది. మీరు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉన్నారనుకోండి… మీ బీపీ చాలా కంట్రోల్ లో ఉంటుంది. దాని వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

ఏడవడం వల్ల.. శరీరంలో ఆక్సిటోసిన్ అనే కెమికల్ విడుదల అవుతుందని అందరికీ తెలుసు కదా. ఆక్సిటోసిన్ తో పాటు.. ఇండ్రాఫిన్ అనే కెమికల్ కూడా విడుదల అవుతుంది. ఇవి శరీరానికి మేలు చేసే రసాయనాలు. వీటి వల్ల.. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. డిప్రెషన్ లాంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. బాధ కూడా తగ్గిపోతుంది. చాలామంది ఏడ్చాక.. చాలా ప్రశాంతంగా ఉంటారు. తమలో ఉన్న బాధను మరిచిపోతారు. అందుకే.. మీరు కూడా తరుచూ ఏడుస్తూ ఉండండి. హాయిగా ఉండండి. ఈ ఆర్టికల్ చదివాక మాత్రం ఓ సారి ఏడ్చేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 29, 2021 at 8:24 ఉద.