cucumber health benefits
cucumber health benefits

Cucumber : మనిషికి ప్రకృతి పెద్ద వరం. ఎందుకంటే.. ప్రకృతి లేకపోతే మనిషి లేడు. ప్రకృతే మనిషిని నడిపిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎంత పెద్ద వైరస్ అయినా సరే.. ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదంతో నయం చేయగలిగాం. అదే ప్రకృతికి ఉన్న గొప్పదనం. ప్రకృతి కన్నతల్లి లాంటిది. అందుకే.. ప్రకృతిని ఎప్పుడూ నమ్ముకుంటేనే మనకు మనుగడ. అలా ప్రకృతిలో దొరికే ఎన్నో పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటి కీర దోసకాయ. కీరదోస చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కీరదోసకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే.. కీర దోసను సలాడ్స్ లో, భోజనానికి ముందు, ఇలా రకరకాలుగా వాటిని మనం వాడుతుంటాం.

cucumber health benefits
cucumber health benefits

చాలామంది కీర దోసను తినరు. దాన్ని కూర వండుకొని తినాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే కోసుకొని కూడా తినేయొచ్చు. మామూలు దోసకాయ కన్నా కూడా కీర దోసలో ఎన్నో సుగుణాలు ఉంటాయి. మార్కెట్లలోనూ కీరదోసకు బాగానే గిరాకి ఉంటుంది. నిజం చెప్పాలంటే కీర దోస అనేది ఒక ఔషధం. శరీరానికి ఎంతో మేలు చేసే ఔషధాన్ని తింటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Cucumber : డయాబెటిస్ ఉన్నవాళ్లు కీరదోసను ఖచ్చితంగా తినాల్సిందే

ప్రస్తుతం అందరినీ వేధించే వ్యాధి డయాబెటిస్. దాన్నే షుగర్ అని కూడా అంటాం. ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురికి షుగర్ వస్తోంది. శరీరంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచాలంటే.. ఖచ్చితంగా కీరదోసను తినాల్సిందే. శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా కీరదోసను తినొచ్చు. అలాగే.. ఊబకాయంతో బాధపడేవాళ్లు కీరదోసను నిత్యం తింటే.. ఊబకాయం సమస్య తగ్గుతుంది.

కీర దోసలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, జింక్, పాస్ఫరస్, ఐరన్ లాంటి మినరల్స్ శరీరంలో ఉన్న చెడు పదార్థాలను తరిమికొడతాయి. అలాగే.. కిడ్నీలలో రాళ్లు ఉన్నవాళ్లు కీరదోసను నిత్యం తీసుకుంటే.. రాళ్లు కరిగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. ముఖ్యంగా కీరదోసలో ఎక్కువశాతం నీరు ఉంటుంది. కాబట్టి.. కీరదోసను నిత్యం తీసుకుంటే.. డీహైడ్రేషన్ సమస్యే రాదు. అలాగే.. చర్మ సమస్యలు ఉన్నవాళ్లు.. కళ్ల కింద నల్లని మచ్చలు ఉన్నవాళ్లు కీరదోసను రౌండ్ ముక్కలుగా కట్ చేసి.. కళ్ల మీద పెట్టుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు వెంటనే తొలగిపోతాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 6, 2021 at 4:39 సా.