Alcohol Drinking : మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అదేనండి.. మందు తాగే అలవాటు.. ఒకవేళ ఆ అలవాటు ఉంటే దాన్ని మానేద్దాం అనుకుంటున్నారా? మద్యం తాగడం, తాగకపోవడం అనేది పూర్తిగా వాళ్ల పర్సనల్ విషయం. కానీ.. చాలామంది మద్యం తాగి ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంటారు. అందరిలో గొడవ పెట్టుకుంటారు. కొందరైతే రోజూ తాగుతారు. రోజుకో ఫుల్ బాటిల్ తాగేవాళ్లు కూడా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించే వ్యక్తి అందులో 30 నుంచి 50 శాతం వరకు అంటే 500 వరకు కేవలం మద్యం తాగడానికే ఖర్చు చేస్తాడు అంటే.. మద్యం కోసం జనాలు ఎంతలా డబ్బులు వృథా చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
నిజానికి మద్యం తాగడం అనేది చెడ్డ అలవాటా? మంచి అలవాటా? అనేది పక్కన పెడితే రోజూ మద్యం తాగేవాళ్లు సడెన్ గా మద్యం తాగడం మాత్రం ఆపేయొద్దు. ఎందుకంటే.. రోజూ శరీరానికి మద్యాన్ని మనం అలవాటు చేస్తున్నాం. కొన్నేళ్ల పాటు రోజూ కంటిన్యూగా మద్యం తాగుతూ ఉన్నవాళ్లు.. ఇంట్లో వాళ్ల బలవంతంతోనో.. లేక ఇతర కారణాల వల్లనో సడెన్ గా మద్యం తాగడం మానేస్తారు. అది చాలా డేంజర్ అనే చెప్పుకోవాలి.
Alcohol Drinking : సడెన్ గా మద్యం తాగడం మానేస్తే మీ శరీరంలో జరిగేది ఇదే
సడెన్ గా మద్యం తాగడం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆల్కాహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్.. అనే వ్యాధి ఇలా సడెన్ గా మద్యం తాగడం మానేసే వాళ్లకు వస్తుంది. రోజూ మద్యం తాగేవాళ్లు సడెన్ గా తాగడం మానేస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. వెంటనే ఫీవర్ వస్తుంది. బాడీ షేక్ అవుతుంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి.
ఇంకొందరికి అయితే చెమటలు పట్టడం, ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మద్యం మానేయాలని అనుకునేవాళ్లు సడెన్ గా మానేయకండి. రోజూ హాఫ్ తాగేవాళ్లు.. క్వార్టరే తాగండి.. క్వార్టర్ తాగే వాళ్లు ఒక్క పెగ్ తాగండి.. అలా రోజు కొంత మోతాదులో తీసుకుంటూ నెమ్మదిగా బాడీని ఆల్కాహాల్ కు దూరం చేయాలి కానీ.. సడెన్ గా బాడీని ఆల్కాహాల్ కు దూరం చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. సడెన్ గా ఎవరైనా మందు మానేస్తామన్నా వాళ్లను అలా మానేయనీయకండి.. కొద్ది కొద్దిగా వాళ్లను తాగి లిమిట్ గా ఉంటూ నెమ్మదిగా మానేయమని చెప్పాలి. అలా చేస్తేనే మద్యం మానేస్తే వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.