do not eat these food with milk health tips telugu
do not eat these food with milk health tips telugu

Milk : పాలు.. చిన్నపిల్లలయితే లొట్టలేసుకుంటూ తాగుతారు. పాలంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవ్వరూ ఉండరు. పొద్దున లేవగానే పాలు ఇంట్లో ఉండాల్సిందే. పాలు ఉంటేనే చాయ్ కానీ.. కాఫీ కానీ చేసుకుంటాం. రోజు గడవాలంటే ఖచ్చితంగా ఇంట్లో కాసిన్ని పాలు ఉండాల్సిందే. అయితే.. మనం ఏ ఆహారం తీసుకున్నా.. కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. కొన్ని పదార్థాలను కలిపి తింటే అనారోగ్య సమస్యలు రావడంతో పాటు.. అవి ప్రాణాలకే ముప్పు వచ్చేలా చేస్తాయి.

do not eat these food with milk health tips telugu
do not eat these food with milk health tips telugu

అలాగే.. పాలు తాగేటప్పుడు కూడా కొన్ని పదార్థాలను తినకూడదు. పాలతో పాటు వీటిని తిన్నారంటే.. ప్రాణాలకే ప్రమాదం. అందుకే.. పాలు తాగేటప్పుడు ఈ ఆహారాన్ని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఇంతకీ ఏంటా ఆహారం అంటారా? పదండి.. అవేంటో తెలుసుకుందాం.

Milk : నాన్ వెజ్ అస్సలు తినకూడదు

పాలు తాగుతూ నాన్ వెజ్ తిన్నారంటే ఇక అంతే. పాలు తాగుతూ.. చికెన్, మటన్, ఫిష్, గుడ్లు.. ఏవి కూడా తినకూడదు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కాదు. మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. అందుకే.. పాలు తాగుతున్నారంటే నాన్ వెజ్ ను పక్కన పెట్టండి.

పాలు, పెరుగు.. ఒకే జాతికి చెందినవే అయినప్పటికీ.. పాలు తాగుతూ పెరుగును తినకూడదు. ఎందుకంటే.. పెరుగు అనేది పులియబెట్టిన ఆహారం. దాంతో పాటు పాలను తాగకూడదు. అలా చేశారంటే.. కడుపు ఉబ్బరం సమస్యలు, ఇతర సమస్యలు వస్తాయి. అలాగే.. ముల్లంగితో పాటు పాలను తాగకూడదు. ఎందుకంటే.. ముల్లంగి శరీరంలో వేడిని పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో పాలు కూడా తాగితే లేనిపోని సమస్యలు వస్తాయి.

చాలామందికి పుల్లటి పదార్థాలంటే చాలా ఇష్టం ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ, సంత్రా, బత్తాయి.. లాంటి పండ్లను కొందరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎందుకంటే.. అవి పుల్లపుల్లగా ఉంటాయి. అయితే.. ఈ పుల్లని పదార్థాలతో కలిపి పాలను అస్సలు తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. గుండెలో మంట కూడా వస్తుంది.

అరటి పండు తింటూ పాలు అస్సలు తాగకండి. అరటిపండుకు, పాలకు అస్సలు పడదు. అలా చేస్తే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఒకవేళ.. మిల్క షేక్ లాంటివి తాగితే మాత్రం.. దాంట్లో కాసింత దాల్చిన చెక్క పౌడర్ వేసి తాగితే బెటర్. లేదంటే జీర్ణ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 5, 2021 at 4:28 సా.