Papaya Health Benefits: ఈమధ్య కాలంలో తరచుగా ప్లేట్‌లెట్ల్ తగ్గడం అనే మాట వింటున్నాం. అసలు ప్లేట్‌లెట్స్ ఎక్కడుంటాయి.. ఎంతసంఖ్యలో అవి మన శరీరంలో ఉండాలి..? ప్లేట్‌లెట్స్ తగ్గితే ఎక్కువగా బొప్పాయి పండును లేదా బొప్పాయి ఆకుల రసాన్ని ఎందుకు తినమంటున్నారు. అసలు బొప్పాయి మన రోగనిరోధక శక్తిని ఏ విధంగా పెంచుతుందో తెలుసుకుందాం.

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి.
డెంగ్యుని నివారిస్తుంది..!
డేంగ్యును నివారించడంలో ఒక ట్రెడిషినల్ పద్దతి. బొప్పాయి ఆకుల రసాన్నిత్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డేంగ్యూను నివారించుకోవచ్చు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది. బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది మరియు డేంగ్యు వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.
పరిశోధనలు ఏం చెప్తున్నాయి.?
బొప్పాయి మరియు దాని ఆకులు రెండూ కొన్ని రోజుల్లో తక్కువ ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. 2009లో మలేషియాలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు బొప్పాయి ఆకు రసం డెంగ్యూతో బాధపడుతున్న రోగులలో ప్లేట్‌లెట్ల శాతాన్ని పెంచుతుందని కనుగొన్నారు.
బొప్పాయిలో ఏయే పోషకాలు ఉంటాయి..?
పండిన బొప్పాయి తినడం లేదా కొద్దిగా నిమ్మరసంతో ఒక గ్లాసు బొప్పాయి రసం రోజుకు 2 లేదా 3 సార్లు తాగడం ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి.
బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా… ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.
భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.