Vaccines: కరోనా నియంత్రణకు గాను అనేక రకాల వ్యాక్సిన్స్‌ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి వాటి గురించి మనకు ఎంత మాత్రం తెలుసు? ఏ టీకా ఎంతమేర ప్రభావం చూపుతుంది..? దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వీ టీకాలు ఇస్తున్నారు. అయితే చాలా మందికి ఈ వ్యాక్సిన్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం తెలియదు. ఏ వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్‌గా ఉంటామనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ..? మరి వాటన్నింటికీ సమాధానమే ఈ కథనం.

కోవాగ్జిన్ కథేంటి..?
* కోవాగ్జిన్‌ను ఎలాంటి చలనం లేని కరోనా వైరస్ సాయంతో తయారు చేశారు. కరోనా వైరస్‌ను అచేతనం చేయడం వల్ల దీన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేసినా ఎలాంటి హానీ ఉండదు. ఈ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. దాదాపు 123 దేశాలకుపైగా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తోంది.
* ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శరీరంలోని రోగ నిరోధక కణాలు గుర్తు పడతాయి. అలా శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసి కరోనా వైరస్‌తో పోరాడుతాయి. కోవాగ్జిన్ సెకండ్ డోస్‌ను నాలుగు వారాల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.
* అయితే ఈ వ్యాక్సిన్ 81 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది.

కోవిషీల్డ్ మాటేమిటి..?
* ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. భారత్‌లో ది సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
* చింపాంజీల నుంచి సేకరించిన సాధారణ జలుబు వైరస్ (అడెనో వైరస్)ను బలహీనపర్చడం ద్వారా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ జలుబు వైరస్‌ను కరోనా వైరస్ మాదిరిగానే పనిచేసేలా తయారు చేశారు. దీంతో ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకదని శాస్త్రవేత్తలు తెలిపారు.
కోవాగ్జిన్ వేయించుకున్న తర్వాత సెకండ్ డోస్ 12 వారాల తర్వాత వేయించుకోవాలి.
ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది.

స్పుత్నిక్-వీ ఎలా పని చేస్తుంది..?
* రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకా సురక్షితమైనదని, ఇది భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న     ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లాగే పనిచేస్తుందని భావిస్తున్నారు.

* ఈ వ్యాక్సిన్ కోవిడ్ నుంచి 92 శాతం వరకు రక్షణ కల్పిస్తుంది.
* ఈ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్‌లో తయారు చేశారు.
* ఈ వ్యాక్సిన్ కోల్డ్ టైప్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. కరోనా వైరస్‌ జెనిటిక్ కోడ్‌కు తగ్గట్లుగా వైరస్‌ను అరికడుతుంది. ముప్పును గుర్తించి.. కరోనాతో పోరాడే యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పుత్నిక్-వీ సెకండ్ డోస్‌ను 21 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సెకండ్ డోస్ అనేది కరోనా వైరస్ స్పైక్ లక్ష్యంగా పనిచేస్తాయి. న్యూట్రలైజ్ చేసిన వైరస్ శరీరంలోకి స్పైక్‌ను తీసుకెళ్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతూ.. దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 20, 2021 at 5:07 సా.