eating heavy food at night danger to health
eating heavy food at night danger to health

అదేదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అన్నం మితంగా తింటే ఆహారం.. అమితంగా తింటే విషం అని అంటారు. మన పెద్దలు కూడా అదే చెబుతుంటారు. నిజానికి.. మనిషికి ఆహారం అనేది అవసరమే. కానీ.. దాన్ని మితంగా తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే అది విషంగా మారుతుందట. మన తాతలు, ముత్తాతలు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. తక్కువ తింటే.. ఎక్కువ కాలం జీవిస్తారట. అయితే.. తాజాగా ఓ విషయం పరిశోధనలో తేలింది ఏంటంటే.. చాలామంది ఉదయం, మధ్యాహ్నం కంటే.. రాత్రి పూట ఎక్కువగా తింటున్నారట. ఎక్కువగా రాత్రి పూటే లాగించేస్తున్నారట.

eating heavy food at night danger to health
eating heavy food at night danger to health

నిజానికి.. మనమంతా రివర్స్ పద్ధతిలో తింటున్నాం. ఉదయం టిఫిన్ ఎక్కువగా తినాలి. మధ్యాహ్నం కొంచెం తక్కువగా తినాలి. రాత్రి పూట ఇంకాస్త తక్కువగా తినాలి. అది సరైన పద్ధతి కానీ.. మనం మాత్రం ఉదయం టిఫిన్ ను కొంచెమే తింటాం. మధ్యాహ్నం అన్నం బాగా తింటాం. రాత్రి పూట అన్నం కూడా బాగా తింటాం. ఇలా చేయడం వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.

రాత్రి పూట అమితంగా తిన్నా… లేట్ గా తిన్నా సమస్యలే

రాత్రి పూట అన్నం అంటే.. ఎప్పుడు తినాలో తెలుసా? రాత్రి 8 లోపు తినేయాలి. కానీ.. ఈ జనరేషన్ లో అర్ధరాత్రి తర్వాత జనాలు రాత్రి భోజనం చేస్తుంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. రాత్రి పూట లేట్ గా తిన్నా.. ఎక్కువ ఆహారం తిన్నా కూడా బరువు పెరుగుతారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొందరు తినగానే నిద్రపోతుంటారు. లేట్ గా తింటుంటారు. ఇలా చేయడం వల్ల.. అజీర్తి సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు. బరువు పెరుగుతారు. ఊబకాయం సమస్య వస్తుంది.

రాత్రి పూట తినే ఆహారం మితంగా ఉండటంతో పాటు.. తినే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండేవి తినాలి. లేదంటే.. అతిగా బరువు పెరుగుతారు. అలాగే.. కనీసం రాత్రి పూట పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 14, 2021 at 10:07 ఉద.