Eating Sweets at Right Time: తీపి పదార్థాలు భోజనం ముందు తినాలా, లేక భోజనం తరువాత తీసుకోవాలా… ఆయుర్వేదం ఏమి చెబుతోంది….!

S R

Eating Sweets at Right Time మన భారతీయ సంప్రదాయంలో ఆహారాన్ని ఔషధంగా భావిస్తాము. మనం తినే ఆహరం మనకు నోటికి రుచిని మాత్రమే కాదు శరీరానికి శక్తిని ఇవ్వాలి. భారతీయ ఆహారంలో ఎక్కువగా శాఖహారానికి ప్రాముఖ్యత ఉంది. అదికాక ఆయుర్వేదంలో మనం ఆహారాన్ని ఎలా తీసుకోవాలో కూడా వివరించారు. ఇక మనలో చాలా మందికి భోజనం అయ్యాక ఒక స్వీట్ లేదా డేజర్ట్ తినడానికి ఇష్టపడతారు. కానీ అసలు స్వీట్ భోజనం తరువాత తినవచ్చా అని ఎపుడైనా ఆలోచించారా ఈ ఆర్టికల్ లో ఆ విషయాన్ని తెలుసుకుందాం….

Eating Sweets at Right Time స్వీట్స్ భోజనం ముందా… తరువాత….

మెరుగైన జీర్ణక్రియ మరియు పోషకాహారం కోసం మీ భోజనాన్ని స్వీట్‌లతో ప్రారంభించాలని ఆయుర్వేదం సూచిస్తోందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలను తిన్నపుడు అవి జీర్ణం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి భోజనం తరువాత స్వీట్స్ తింటే మన జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు.

ఇక భోజనం ముందు స్వీట్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్వీట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి భోజనం ముందు తింటే జీర్ణ స్రావాలు విడుదలయి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అలా తరువాత భోజనం చేసిన అరుగుదలకు ఉపయోగపడుతుంది. భోజనాన్ని స్వీట్స్ తో ముగించడం కూడా గ్యాస్ ఏర్పడటానికి మరియు ఉబ్బరానికి దారితీస్తుంది. భోజనం తినడం కాదు సరిగా తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అందుకే మనం తినే ఆహరమే మన శరీరానికి ఔషధం అని ఆయుర్వేదం చెబుతోంది.

- Advertisement -