flowers used in ayurveda medicine
flowers used in ayurveda medicine

Ayurveda Flowers : పువ్వులు అంటే నచ్చని వాళ్లు ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరికీ పువ్వులు నచ్చుతాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో పువ్వులతో ఆడుకుంటారు. కొన్ని పూల నుంచి వచ్చే సువాసన అయితే ఎంతో మధురంగా ఉంటుంది. ఆ వాసన పీల్చితే చాలు.. ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మల్లెపులు ఎక్కడ ఉంటే అక్కడ సువాసనే. పూలు కేవలం.. సుగంధాలను వెదజల్లడానికి.. అలంకరణకు, జడల్లో పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు అని మనం అనుకుంటాం కానీ.. పూలల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయట.

flowers used in ayurveda medicine
flowers used in ayurveda medicine

మీకు తెలుసా? తేనెటీగలు.. మకరందాన్ని ఎక్కడి నుంచి తెచ్చి దాన్ని తేనెగా మారుస్తాయి.. పూల నుంచే అవి మకరందాన్ని సేకరిస్తాయి. అంటే.. మనం తాగే తేనె కూడా పూల నుంచి వచ్చిందే అన్నమాట. అయితే.. అన్ని పూలలో కాకున్నా.. కొన్ని పూలలో మాత్రం విపరీతంగా ఆయుర్వేద సుగుణాలు ఉన్నాయట. ఆ పూలను ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. ఇంతకీ అవి ఏ పూలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Ayurveda Flowers : మనం ప్రతి రోజూ చూసే పూలలోనే ఆయుర్వేద గుణాలు

మనం పొద్దున లేచిన దగ్గర్నుంచి ఆ పూలను చూస్తూనే ఉంటాం కానీ.. వాటిలో ఆయుర్వేద గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. మందార పువ్వు, గులాబీ పువ్వు, లోటస్ పువ్వు, జాస్మిన్.. ఇలా పలు రకాల పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయట. మందార పువ్వులను ఆయుర్వేద టీ తయారీలో ఉపయోగిస్తారట. బీపీ తగ్గించడం కోసం, జుట్టు సంబంధ సమస్యలను తగ్గించడం కోసం, పైల్స్ ను తగ్గించడం కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో మందార పువ్వును విరివిగా వాడుతారట.

గులాబీ పువ్వులను ఇష్టపడని వాళ్లు ఉండరు. వీటిలో ఔషధ గుణాలు కూడా బోలెడు ఉంటాయి. ఈ పువ్వుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పువ్వుతో తయారు చేసిన రసాన్ని వాడటం వల్ల.. శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. అలాగే.. తలనొప్పిని తగ్గించేందుకు కూడా గులాబీ పువ్వులను ఉపయోగిస్తారు.

ఇక.. ఔషధ గుణాలు కలిగిన మరో పువ్వు.. లోటస్. ఇవి చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పువ్వులను చర్మ వ్యాధులను తగ్గించడం కోసం, విరేచనాలు తగ్గించడం కోసం తయారు చేసే ఆయుర్వేద మందులో వాడుతారు. అలాగే.. జాస్మిన్ పువ్వును కూడా టీగా తయారు చేసి.. డిప్రెషన్ ను తగ్గించడం కోసం వాడుతారు. జీర్ణ సమస్యలను తగ్గించడం కోసం కూడా వాడుతుంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 3, 2021 at 12:11 సా.