Lukewarm Water: వానా కాలం వచ్చిందంటే చాలా తీవ్ర అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటుంటారు పెద్దలు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుందని.. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుందని చెబుతారు. కొందరిలో వేడినీళ్లు తాగగానే చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది.
ఎన్ని ఉపయోగాలో చూడండి…!
 • బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపశమనం కలిగిస్తుందో మీరే గమనించవచ్చు.
 • నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతుంది
 • ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని తాగాలి. వర్షాకాలంలో ఇబ్బందిపెట్టే జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బందిపడేవారు గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనిద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది.
 • కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు.. ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులకు వేన్నీళ్ల మంచి ఔషదం.
 • అధిక బరువు, ఊబకాయం సమస్యలనూ వేడి నీళ్లతో అధిగమించవచ్చు.
 • మధుమేహం వస్తుందనే అనుమానం ఉంటే.. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
 • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
 • దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారు గోరు వెచ్చని నీరు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 • వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 • వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది.
 • గొంతు సమస్యలు దరి చేరువు.

కూర్చునే నీటిని తాగాలి..
ఈ బిజీ లైఫ్ లో భోజనం చేయటానికే టైం కుదరటం లేదు. కానీ ప్రశాంతంగా కూర్చునే తినాలి. అలాగే మంచి నీళ్లు తాగటం కూడా నిలబడి గటగటా తాగటం వల్ల కిడ్నీలకి మంచిది కాదు. ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చక్కగా కూర్చుని రిలాక్స్‌డ్‌గా నిదానంగా నీటిని తీసుకోవాలి.
ఇలా తాగాలి: ఉదయం నిద్రలేచిన తర్వాత, కాలకృత్యాల కంటే ముందుగానే కనీసం రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. నీటిని ఒక్కసారిగా గొంతులో వేసుకోకుండా నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగాలి. ఇలా రోజూ చేస్తే చాలా కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితాలు చూడవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ స్త్రీలు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిది. మరెందుకు ఆలస్యంగా చూశారుగా వేడినీటి వల్లె ఎన్ని ప్రయోజనాలో మరి మీరు ఇలా నీటిని తాగేయ్యండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 24, 2021 at 9:10 ఉద.