green leaves: మనం రోజూ తీసుకునే ఆహారంలో అనేక రకాల ఆకుకూరలను వినియోగిస్తుంటాం. వీటిలో పాలకూర, గోంగూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మ‌న శ‌రీరానికి అవసరమైన విటమిన్ ఏ,డీ,కే,సి, మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, క్యాల్షియం, సోడియం, ఇత‌ర పోష‌కాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు వివిధ రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే పాంటోథెనిక్ ఆమ్లం పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి. అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఆకుకూరలు పనిచేస్తాయి. ఆకుకూరల్లో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేసి చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లో ఉండే అధిక ఫైబర్ బరువును త‌గ్గించడంలో స‌హాయ ప‌డుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కంను నివారించి జీర్ణ‌క్రియను రేటు మెరుగుపరుస్తుంది.

ఖనిజాల గని ఆకుకూరలు..

ఆకుకూరలు లభించే ఫ్లేవనాయిడ్స్, విట‌మిన్ కె.. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మెద‌డు చురుగ్గా మారీ జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.
ఆకుకూరలు పొటాషియం అధికంగా ఉంటుంది. కావున హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం పాల‌కూర‌లో పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎముక‌ల్లో సాంద్ర‌త పెరిగి ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. అలాగే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రిచి దృష్టి లోపాలను నివారిస్తాయి. కావున ప్రతి రోజు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడం వల్ల సహజ పద్ధతిలో మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకవిలువలు సమృద్దిగా పొందవచ్చు.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు…

  • ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
  • ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఐరన్‌ కలిగి ఉంటాయి. శరీరంలో ఐరన్‌ కారణంగా అనీమియ వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు (పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
  • ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ – సి కూడా పుష్కలంగా ఉంటాయి.
  • విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
  • ఆకుకూరలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరెందుకు ఆలస్యం ప్రతి రోజు ఏదో ఒకరూపంలో మన భోజనంలో ఆకుకూరలను ఆడ్‌చేసుకుందామా..!

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2021 at 11:58 సా.