Jamun Fruit : అల్లనేరేడు పండ్లు.. ఈ పండ్లను అన్ని పండ్లలో రాజు అని పిలుస్తారు. ఎందుకంటే.. ఈ పండులో ఉండే సుగుణాలు, ఔషధ గుణాలు ఏ పండులోనూ ఉండవు. అల్లనేరేడు పండ్లు మాత్రమే కాదు.. చెట్టులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లనేరేడు ఆకులను, చిగుళ్లను.. ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవల కరోనాకు ఆయుర్వేద మందును కనిపెట్టిన ఆనందయ్య.. తను తయారు చేసే మందులో నేరేడు చిగుళ్లను కూడా వాడుతారు. అల్లనేరేడులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టే.. ఆ పండుకు అంత డిమాండ్. అల్లనేరేడు పండ్లు సంవత్సరమంతా దొరకవు. ఎండాకాలం సీజన్ అయిపోతున్న సమయానికి.. అల్లనేరేడు పండ్లు కోతకు వస్తాయి.

వేసవి సీజన్ లో మామిడి పండ్లను ఎలా తింటామో.. అల్లనేరేడు సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిని కూడా తినాలి. జీవితంలో ఏ పండ్లను తిన్నా.. తినకున్నా.. ఖచ్చితంగా అల్లనేరేడు పండ్లను మాత్రం తినాలి. అల్లనేరేడు పండును తినడం వల్ల.. ఎన్నో లాభాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Jamun Fruit : అల్లనేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
అల్లనేరేడు పండ్లను ముఖ్యంగా షుగర్ తో బాధపడుతున్నవాళ్లు ఎక్కువగా తినాలి. షుగర్ ఉన్నవాళ్లు అల్లనేరేడు పండ్లను తిన్నా.. ఆ పండ్ల విత్తనాలను ఎండబెట్టి.. పొడిలా చేసుకొని రోజూ తిన్నా కూడా షుగర్ అదుపులో ఉంటుంది. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు ఎక్కువగా అల్లనేరేడు పండ్లను తింటుంటారు.
లివర్ సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు అల్లనేరేడు దివ్యౌషధం. లివర్ ను అల్లనేరేడు పండ్లు శుభ్రం చేస్తాయి. లివర్ లో ఉన్న విష పదార్థాలను ఈ పండు నాశనం చేసి లివర్ ను క్లీన్ చేస్తుంది. అందుకే.. ప్రతి సంవత్సరం సీజన్ లో దొరికే ఈ పండ్లను ఒక్కసారైనా తినాలి. అలాగే.. చాలామంది కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్లు అల్లనేరేడు పండ్లను తింటే కిడ్నీలలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. అలాగే.. శరీరంలో ఉన్న విషపదార్థాలు, అవసరం లేని పదార్థాలను కూడా నాశనం చేసే గుణం అల్లనేరేడు సొంతం.
రక్తంలో ఎర్రరక్తకణాల వృద్ధికి నేరేడు పండు ఎంతో ఉపయోగపడుతుంది. గర్భిణీలు కూడా ఈ పండును తినొచ్చు. దాని వల్ల తల్లికీ, కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచిది. పల్స్ రేటును కంట్రోల్ లో ఉంచడానికి ఈ పండు ఎంతో దోహదపడుతుంది. ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. కంటి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే.. కాల్షియం, పొటాషియం, ఐరన్ లాంటి మినరల్స్ ఈ పండులో ఎక్కువగా ఉండటం వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.