health benefits of konda pindi aaku
health benefits of konda pindi aaku

Kidney Stones : చాలామందికి కిడ్నీల్లో రాళ్లు వస్తుంటాయి. వేడి ఎక్కువైనా.. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా.. కిడ్నీ మీద ఎక్కువ ఒత్తిడి పడినా.. కిడ్నీల్లో రాళ్లు తయారవుతుంటాయి. మంచి నీళ్లు అధికంగా తాగితే సమస్య లేదు కానీ.. మంచినీళ్లను ఎక్కువగా తాగని వాళ్లను కిడ్నీ రాళ్ల సమస్య ఎప్పుడూ వేధిస్తుంటుంది. కిడ్నీల్లో రాళ్లు వస్తే.. ఆపరేషన్ తీసి కిడ్నీలోని రాళ్లను తీసేయడమో లేక.. మెడిసిన్స్ తో రాళ్లను తీసేయడమో చేస్తుంటారు. అయితే.. కిడ్నీల్లో రాళ్ల సమస్య చాలామందిని ఈ మధ్య వేధిస్తోంది. దీని కోసం ఆసుపత్రులకు వెళ్లి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయితే.. రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక ఆకుతో కిడ్నీల్లో ఉన్న రాళ్లన్నింటినీ కరిగించవచ్చు. అలాగే.. కిడ్నీలలో మళ్లీ జన్మలో రాళ్లు రాకుండా చేసుకోవచ్చు.

health benefits of konda pindi aaku
health benefits of konda pindi aaku

కాల్షియం పాస్ఫేట్ లాంటి రసాయనాల వల్ల.. కాల్షియం టాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల.. కిడ్నీలలో రాళ్లు వస్తుంటాయట. కిడ్నీ రాళ్ల వల్ల.. కొందరికి మూత్ర సంబంధ సమస్యలు కూడా వస్తుంటాయి. మూత్రంలో మంట రావడం, మూత్రం సరిగ్గా రాకపోవడం.. లాంటి సమస్యలు వస్తాయి. కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కిడ్నీలలో విపరీతంగా నొప్పి కూడా వస్తుంటుంది. ఇటువంటి అన్ని సమస్యలకు కేవలం ఒకే ఒక ఆకుతో చెక్ పెట్టొచ్చు.

Kidney Stones : పొలం గట్ల మీద దొరికే కొండ పిండి ఆకును తింటే చాలు

మీరు ఎప్పుడైనా కొండపిండి ఆకు గురించి విన్నారా? పొలం గట్ల మీద ఇది ఎక్కువగా పెరుగుతుంటుంది. దీనికి ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది. ఆయుర్వేద మందుల్లో ఈ కొండపిండి ఆకును విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది ఒక దివ్యౌషధం. దీంట్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. పొలం గట్ల మీదనే కాదు.. మన ఇంటి పెరట్లోనూ ఇది దొరుకుతుంది. కొండ పిండి ఆకులను తీసుకొని.. వాటిని పప్పులో కూరగా వండుకొని చాలా మంది తింటుంటారు. వర్షాకాలం సీజన్ లో ఇది ఎక్కువగా దొరుకుతుంది.

health benefits of konda pindi aaku
health benefits of konda pindi aaku

కొండపిండి ఆకును ఇలా క్రమం తప్పకుండా కొన్ని సార్లు తీసుకుంటే చాలు. కిడ్నీల్లో ఉన్న ఎంత పెద్ద రాళ్లు అయినా కరిగిపోవాల్సిందే. మళ్లీ మీకు జన్మలో కిడ్నీల్లో రాళ్లు రమ్మన్నా రావు. కొండ పిండి ఆకులను ఎండబెట్టి దంచి దాన్ని చూర్ణంగానూ చేసుకొని వాడొచ్చు. ఆ చూర్ణాన్ని కొన్ని నీళ్లలో కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి. అలా చేసినా కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. లేదంటే.. ఆ నీటితో తయారు చేసిన కషాయాన్ని కూడా తాగొచ్చు. లేదంటే ఆ ఆకులను డైరెక్ట్ గా కూడా తినొచ్చు. ఎలా తిన్నా.. వాటి పని మాత్రం.. శరీరంలోకి వెళ్లాక.. కిడ్నీల్లో ఉన్న రాళ్లను కరిగించడం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 22, 2021 at 3:09 సా.