Onion Benefits: ప్రస్తుత ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనుషుల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగింది. ఇక అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఒత్తిడికి గురవుతున్నారు. బిజీ పరిస్థితుల్లో టెన్షన్ పడుతూ కొంతమంది తమ ఆరోగ్యం గురించి మరిచిపోతున్నారు. బయట ఏది పడితే అది తింటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదనే సామెత మనకు తెలిసిందే. ఇది అక్షరాలా నిజం. మరి ఆ ఉల్లిపాయ గురించి తెలుసుకుందాం. ఉల్లి లేనిది ఏ కూర వండలేము. ఏ కూర తయారుచేయాలన్నా.. ఉల్లి అనేది తప్పనిసరిగా కావాల్సింది. అది ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఉల్లి లేనిది వంటిట్లో ఏ పని జరగదు. కూరకు టేస్ట్ రావాలంటే.. అందులో ఉల్లి పడాల్సింది. కానీ ఉల్లిపాయ తినడం వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి అవగాహన ఉండదు

ఉల్లిపాయ తినడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉంటుంది. బిర్యానీ తినేటప్పుడో, పెరుగన్నం తినేటప్పుడో పచ్చి ఉల్లిపాయను తింటూ ఉంటారు. ఇలా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

పచ్చి ఉల్లిపాయను భోజనంలో కలిపి తీసుకుంటే చాలా మంచిదట. ఇలా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అలెర్జీ తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుందట. ఉల్లిపాయల్లో ఉండే సి.బి, పొటాషియం రక్తపోటు సమస్యను పరిష్కరిస్తుందట.

ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్గా పనిచేస్తాయని, షుగర్ పేషెంట్స్లో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ఇక ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను తరుచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయట.

50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పచ్చి ఉల్లిపాయను నిత్యం ఏదో ఒక విధంగా తింటుంటే షుగర్ గణనీయంగా తగ్గుతుంది. ఒకేసారి తినకున్నా రోజులో 3 సార్లు 50 గ్రాముల ఉల్లిపాయను విభజించుకుని తిన్నా ఫలితం ఉంటుందట.

జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉపయోగపడే మెరుగైన పదార్థాల్లో ఉల్లి ఒకటి. ఇందులోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇలా ఉల్లి వల్ల అనేక ప్రయోజనలున్నాయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 7, 2021 at 11:51 సా.