Soaked Almonds: రోజూ నానబెట్టిన బాదాం పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలా మంది చెప్తుంటారు. కానీ బాదం పప్పుని అలాగే తింటే ఏమవుతుంది.? ఎందుకు నానబెట్టే తినాలి అన్నది చాలా మందికి తెలియదు.! నానబెట్టిన బాదం పప్పులు ఎందుకు మంచివి? బాదాంలో ఉండే పోషకాలేంటి..? అవి మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయనేది చూద్దాం…!


నోటికి రుచికరమైనవి చాలా వరకూ శరీరానికి మంచివి కావు. కానీ.. బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి పైగా ఎన్నో విటమిన్లు వాటిలో ఉంటాయి. అవి మనల్ని అత్యంత అందంగా, ఆరోగ్యంగా మార్చేస్తాయి.
బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది. అది మన శరీరం బాదాంలోని పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని సుమారు ఎనిమిది గంటలు లేదా రాత్రంతా నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. కాబట్టి మనం తిన్న బాదం మనకి మేలు చేస్తుంది.

1. అరుగుదలకి సహకరిస్తుంది- నానబెట్టిన బాదం పప్పులో నించి లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది.

2. బరువు తగ్గాలంటే తినాల్సిందే : బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయని కొందరు అంటుంటారు. ఒక్కసారి అవి బాడీలోకి వెళ్లాయంటే చాలు… చెడు కొవ్వు ఎక్కడున్నా… తగ్గిస్తాయి. కారణం వాటిలోని విటమిన్లు, ఫైబరే. కాబట్టి… తింటే బరువు పెరిగిపోతామేమో అని ఆలోచించేవారు సైతం… బాదం పప్పులను తినడం మంచిదే.

3. గుండె ఆరోగ్యానికి కూడా బాదం చాలా మంచిది. బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు గుండె సంతోషంగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తినండి… గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

4. బాడీలో మంచి బ్యాక్టీరియా: మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి మనకు మేలు చేస్తుంటాయి. అవి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి… వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. అందుకోసం బాదం పప్పులు తినాలి. ఎందుకంటే… ఆ పప్పులపై ఉండే తొక్కలో… ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి. పొట్టలో నొప్పి, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఆహారం సరిగా జీర్ణం కావట్లేదని అనిపించినా… మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి.

5. ఆరోగ్యకరమైన జుట్టు: మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ… బాదంలలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే… జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B… బాదంపప్పుల్లో ఉంటుంది.

6. ముసలితనానికి చెక్: జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే… మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. ఎందుకంటే… వాటిలోని మాంగనీస్… కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇక విటమిన్ E చర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుంటుంది. అందువల్ల రోజూ బాదం పప్పులు తినేవాళ్లకు త్వరగా ముసలితనం రాదు. ఈ సీక్రెట్ కనిపెట్టిన కాస్మొటిక్ కంపెనీలు… బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీముల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాయి.

7. కాన్సర్తో పోరాడుతుంది. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ 17 కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.

8. నానబెట్టిన బాదంలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్నిపెరగనివ్వవు.

9. గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

10. పుట్టుకతో వచ్చేలోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 25, 2021 at 1:24 సా.