Silhouette of young woman in lotus position sitting on the beach and medditating

Good Health is yours if you do this in this month! మాసాలలో వైశాఖమాసం చాలా పవిత్రమైనది. దీన్ని మాధవమాసంగా కూడా పిలుస్తారు. అంటే సాక్షాత్తు విష్ణువు మాసంగా దీన్ని భావిస్తారు. ఇది ప్రతి ఏడు ఉగాది తర్వాత అంటే చైత్రమాసం తర్వాత వస్తుంది. తెలుగు నెలల ప్రకారం రెండో తెలుగు నెల. ఈ మాసంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ మాసంలో కొన్ని పనులు, దానాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు పేర్కొన్నారు.

వైశాఖంలో ఏం చేయాలి ?
వైశాఖమాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో, వారికి ఉత్తమగతులు లభిస్తాయి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన నీటితో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.ఎందుకుంటే రావిచేట్టు సాక్షాత్తు విష్ణువు అంశ. అదేవిధంగా ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభఫలితాలనిస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ మాధవమాసంలో జలదానం ఎంతో పవిత్రమైనది. చాలా పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలం ఒక్క జల దానం వలన వస్తుందని పురాణాలలో చెప్పబడింది. అందుకే అవకాశం ఉన్నవారు తప్పక చలివేంద్రాలు పెట్టాలి. ఇలా దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తున్నది. ఈ చలివేంద్రాలు పితరులకు, దేవతలకు, మనుష్యులకు, అందరికీ ఇష్టమైనదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తృప్తిపరుస్తుంది. పూర్వికులంత పుణ్య లోకాన్ని పొందుతారు నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈ సమయంలో ఎక్కువగా లభించే మామిడి పళ్ళ దానం వలన పితృ దేవతలు సంతోషిస్తారు, వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. శయన దానం వలన సుఖ సంతోషాభివృద్ది.

వస్త్ర దానం వలన ఆయువృద్ది .. బీదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది. పానకం నిండిన కుండను దానం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు.

దోసపండు, బెల్లం చెఱుకు గడలు దానం వలన వారి సమస్త పాపాలు తొలగుతాయి. చందనం దానం చేయడం వల్ల తరచూ వాహన ప్రమాదాల నుంచి బయటపడుతారు. అదేవిధంగా తాంబూలం దానం వలన అధిపతి అవుతారని శాస్త్ర వచనం. మజ్జిగ దానం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది.
పాదరక్షలు దానం వలన నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది.

గొడుగు దానం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. బియ్యం దానం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయి. అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది. ఆవు నెయ్యి దానం వలన అశ్వమేథ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. విష్ణు సాయుజ్యం లభిస్తుంది. పితృ దేవతలకు తర్పణాలు వదిలినవారికి దారిద్ర్యబాధ ఉండదు. అన్న దానం విశేష ఫలితాన్నిస్తుంది. వెంటనే తృప్తి ని ఇచ్చే దాన్నలన్నింటి లో ఉత్తమమైనది అన్న దానం. ఇలా ఆయా దానాలు చేయడం వల్ల మాధవుడు సంతోషించి సకల శుభాలను కలిగిస్తాడు. కాబట్టి దానం చేస్తున్నామని అహంకారంతో కాకుండా భక్తితో దానం చేసే అవకాశం విష్ణువు ఇచ్చాడు అని ఎవరికి అయితే దానం చేస్తున్నామో వారిని విష్ణువు అంశగా భావించి దానం చేస్తే తప్పక శాస్త్రాలలో చెప్పిన ఫలితాలు లభిస్తాయి. మానవ సేవనే మాధవసేవగా భావించి సేవ చేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 9, 2021 at 12:21 సా.