Health Tips: కొబ్బరి నీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. అయితే కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసి చేసిన వారికి కూడా కొబ్బరి నీళ్ళు చలువ చెయ్యడానికి ఎంతో సహాయపడుతుంది.
ఆరోగ్యానికి కొబ్బరి నీళ్ళు శ్రేష్టం అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే వేసవిలో మాత్రమే కాదు ఏ కాలంలోనైనా తాగే పానీయాలలో ముఖ్యమైనది ఈ కొబ్బరి నీళ్ళు. ఈ నీరు అందరికి అందుబాటులో కూడా ఉంటుంది. ఈ మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉంటాయి.
మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉంటాయి. అయితే ఈ నీళ్ళు దాహం తీర్చడమే కాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి.
అంతేకాకుండా ఈ కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల అనేక రోగాలు దగ్గరకి రావు. వాత అలాగే పిత్త గుణాలను హరిస్తాయి.
కొబ్బరి నీరు : లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గా ఉంటాయి. అలాగే క్రొవ్వులు అస్సలు ఉండవు. అదే విధంగా చెక్కెర పరమితం గా ఉంటుంది. ఇక కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . అలాగే శరీరములో నీటి లేమిని కరక్ట్ చేస్తుంది.
అదే విధంగా ఆరోగ్య పరంగా జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారముగా పని చేస్తాయి. అయితే విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి నీటిలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు చాలా మంచిది.
అయితే వేసవి కాలములో శరీరాన్ని ఈ నీరు చల్లబరుస్తుంది. అయితే వేసవిలో చెమట కాయలు , డి కురుపులువే , అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరి నీళ్లను తరచుగా తాగాలి. అదే విధంగా కొన్ని రకాల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి.
అలాగే మూత్ర సంభందమైన జబ్బులలోను అలాగే కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అలాగే మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది. కొబ్బరి నీళ్లు రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరంగా ఉంటాయి.
పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్ యాసిడ్ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. అలాగే ఇందులో చక్కెర పదార్థాలు, ఖనిజ లవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది.
అలాగే ఈ నీరు వేడిని తగ్గిస్తాయి. అలాగే విరోచనాలను అరికడతాయి. అదె విధంగా గుండె జబ్బులను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా అన్నిటికీ మించి శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి.
Health Tips: కొబ్బరి నీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుదల..
అందువల్ల రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.