Health Tips: బ్రకోలీ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చాలా మందికి తెలియదు. క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ ప్రసిద్ధ కూరగాయను రెగ్యులర్ డైట్ లో చేర్చితే.. ఇక డాక్టర్ అవసరం ఎప్పటికీ ఉండదు. నిజానికి ఈ కూరగాయలలో ఉన్న అనేక శక్తివంతమైన పదార్థాలు శరీరాన్ని వివిధ మార్గాల్లో నిర్మించడంలో సహాయపడతాయి.
వివిధ సంక్లిష్ట వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.
అలాగే పోషక విలువల పరంగా బ్రకోలీ అనేక ఇతర కూరగాయలను అధిగమించిందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అయితే కూరగాయలు మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతే కాకుండా బ్రకోలీ గత కొన్నేళ్లుగా ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే బ్రకోలీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఇది ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో చాలా మందికి తెలిసి ఉండదు. అందువల్ల ఇప్పుడు క్యాలీఫ్లవర్‌లా కనిపించే బ్రోకోలీలో పోషకాలు, అలాగే బ్రకోలీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో ఒకటైన బ్రోకలీ అధిక మొత్తంలో విటమిన్ సి, కె, డైటరీ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, సెలీనియం, విటమిన్ ఎ, మాంగనీస్, ట్రిప్టోఫాన్, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, జింక్, యు పాలీఫెనాల్స్, క్వెర్సెటిన్ గ్లూకోసైడ్స్, విటమిన్ బి6, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా బ్రకోలీలో అనేక ప్రత్యేకమైన కర్బన్ సమ్మేళనాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు చెప్పాలంటే.. ఫైటోన్యూట్రియెంట్స్ గ్లూకోసినోలేట్స్, ఫ్లేవనాయిడ్స్ మొదలైనవి. అలాగే ఈ పదార్థాలు శరీరంలో ఎలా పనిచేస్థాయి అంటే.. ఈ బ్రకోలీని వండడమే కాకుండా సలాడ్ రూపంలో పచ్చిగా కూడా తింటే మంచిది. అలాగే బ్రకోలీ మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే లక్షణాలను కలిగి ఉంటుంది. అదే విధంగా బ్రకోలీ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తం లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి: బ్రకోలీ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటుంది. ఒక అధ్యయనంలో.. మొలకలు అలాగే బ్రకోలీ తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అని తేలింది. ఇందులోని సల్ఫోరాఫేన్ అనే రసాయనం దీనికి కారణం. అందుకే ఈ టేస్టీ వెజిటేబుల్‌ని డైట్‌లో రెగ్యులర్‌గా చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచవచ్చు.
Health Tips: బ్రకోలీ క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: అయితే బ్రకోలీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. దీని వల్ల శరీరంపై దాడి చేసే ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరం బలంగా తయారవుతుంది. కాబట్టి రోగనిరోధక శక్తి అవసరం ఉన్న వారు బ్రకోలీ నీ క్రమం తప్పకుండా తినాలి.