Health Tips: డ్రై ఫ్రూట్ లలో ఖర్జూరం అనేది ఒకటి. నిత్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఖర్జూరం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అందరికీ తెలిసిందే. రుచికి తీయగా ఉండటం వల్ల ఈ ఖర్జూరం ను తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇక ఖర్జూరంలో ఎండిన ఖర్జూరం, పండు ఖర్జూరం ఉంటుంది. చాలావరకు ఎండిన ఖర్జూరం శరీరానికి బాగా మేలు చేస్తుంది.
ఇక ఖర్జూరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఎన్నో విటమిన్లు, ప్రోటీన్లు ఉన్నాయి కాబట్టి. అవి శరీరానికి బాగా సహాయపడుతుంది. అయితే చాలా మంది ప్రతిరోజు ఖర్జూరాలు తినడం వల్ల మంచిది కాదని అనుకుంటారు. ప్రతి రోజు తినడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని అనుమానంతో ఉంటారు.
కానీ ఇది కేవలం అపోహం మాత్రమే. నిజానికి రోజుకు మూడు చొప్పున ఖర్జూరం తింటే మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ఎముకలకు వచ్చే వ్యాధులను కూడా దరి చేరనివ్వవు. ఇక జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. ఇలా ఉండే విటమిన్ బి 6 శరీరంలోని సెరోటోనిన్, నోరు ఫైన్ ఫ్రైన్ అని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి సమస్యలు దరిచెరువు.’
Health Tips:
ముఖ్యంగా ఖర్జూరాలను ప్రతిరోజు తినటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్ ను కూడా రాకుండా కాపాడుతుంది ఖర్జూరం. ఇక ఖర్జూరంలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు సులువుగా పంపిస్తాయి. ఇక ఇతర సమస్యలకు కూడా ఖర్జూరం బాగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం మూడు ఖర్జూరం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.