Health Tips: ఇప్పట్లో ప్రతివారికి బీపీలు షుగర్లు, కామన్ అయిపోయాయి. ఈ డిసీజెస్ లేని వారు చాలా తక్కువ. ఒకవేళ లేనట్లయితే మంచిదే కానీ వీటితోపాటు ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఎముకల దృఢత్వం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో దృఢత్వం తగ్గుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎముకలే లేనప్పుడు మన శరీరం ముద్దలాగా మారిపోతుంది.
ఎముకలు బలహీన పడినప్పుడు మనకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి ఆస్టియోపోరోసిస్. దీన్నే ఎముకలు గుల్లబారడం అని అంటారు. మెనోపాజ్ టైం లో వస్తుంది ఈస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం వలన ఎముకలు బోలుగా తయారవుతాయి. అందుకే ఎముకల విషయంలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్యులు. కాల్షియం ఫాస్పేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి.
యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవటం వల్ల ఎముకల ఉత్పత్తి కణజాలం దెబ్బతింటుంది. కాల్షియం పుష్కలంగా లభించే ఆహారాన్ని సూచిస్తున్నారు వైద్యులు. ముందుగా ఎముకలు ఎందుకు పాడవుతాయో చూద్దాం. ఎందుకు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం క్యాల్షియంని కోల్పోతుంది. సహజంగానే కొన్ని ఆహార పదార్థాలలో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఉప్పు తీసుకోకూడదు. ఇరిటేడ్ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు సోడా డ్రింక్స్ లో ఉండే పాస్పోరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి కారణం అవుతుంది.
అలాగే కెఫెన్ ఇది కూడా మోతాదుకు మించి తీసుకుంటే శరీరం కాల్షియం కోల్పోతుంది. అందుకే డాక్టర్లు టీ కాఫీ లని ఎక్కువగా తాగొద్దని చెప్తారు. అలాగే ఆల్కహాల్ సేవించడం కూడా శరీరానికి ప్రమాదమే కాల్షియం పోతుందని కాదు కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇప్పుడు ఎముకలకి ఎంతో అవసరమైన కాల్షియం ఏ,ఏ ఆహారాల లభిస్తుందో చూద్దాం. ముఖ్యంగా క్యాల్షియం విటమిన్ డి లో ఉంటుంది. అలాగే ఆస్టియో కాల్సిన్ ని క్రియాశీలం చేసే మెగ్నీషియం ఫాస్ఫరస్ మొదలైనవి ఆహారంలో భాగం చేసుకోవాలి.
కాల్షియం ముఖ్యంగా ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది. పాల ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు మొదలైనవి ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కణజాల నష్టాన్ని నివారిస్తాయి. అలాగే వ్యాయామం కూడా ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరచడంలో తమ పాత్ర పోషిస్తాయి. వెన్నునొప్పి కాళ్ల నొప్పులు మణికట్టు నొప్పి అలాగే ఏ చిన్న పని చేసిన త్వరగా అలసిపోతుంటే మీ ఎముకలు బలహీనంగా మారాయని అర్థం చేసుకోండి. అలాగే ద్రాక్ష రసం ఎముకల ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని బయటికి పంపిస్తుంది.
Health Tips:
ద్రాక్ష రసం తాగడం వల్ల ఎముకల నాణ్యత ఎముక కనీసం కంటెంట్ పెరుగుతుందని కనుగొన్నారు. అలాగే పాశ్చరైజ్డ్ పాలు తాగడం వల్ల కూడా ఎముకలు దృఢపడతాయి వీటిలో విటమిన్ డి తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కెఫీర్ మిల్క్ ఇందులో కూడా విటమిన్ కే టు సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఆకుకూరల జ్యూస్ వృద్ధికి తమ వంతు సహాయం చేస్తాయి. తాగడానికి ఇష్టపడకపోతే స్మూతీ చేసుకొని తాగండి. అలాగే బాదంపాలు సోయా పాలు కూడా మీ ఎముకల దృఢత్వానికి చాలా మేలు చేస్తాయి.