Health Tips: ప్రస్తుతం చలి కాలం కాబట్టి రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక చాలామంది ఈ చలికాలంను అసలు తట్టుకోలేక పోతారు. పైగా కొంతమందికి ఈ చలికాలంలో చర్మ సమస్యలు కూడా ఉంటాయి. అది కూడా డ్రై స్కిన్ తో బాధపడే వాళ్లకు మాత్రం చలికాలం వచ్చిందంటే చాలు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
దీంతో ఎన్ని స్కిన్ క్రీమ్స్ పెట్టిన ఇటువంటి ఫలితం ఉండదు. అలా చలికాలం ఎన్ని రోజులు ఉన్న అన్ని రోజుల వరకు వారికి ముఖం పగిలిపోతూ ఉంటుంది. అయితే ఈ సమస్యలు మాయిశ్చరైజర్ల ద్వారా తొలగినప్పుడు సహజమైన పద్ధతిలో సమస్యను తొలగించుకోవచ్చు. ఆ సహజమైన పద్ధతి ఏదో కాదు క్యారెట్.
మామూలుగా క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి మేలు చేస్తుంది. క్యారెట్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను తొలగించడంలో క్యారెట్ బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ చలికాలంలో చర్మ సమస్యలతో బాధపడే వాళ్ళు క్యారెట్ తో ఇలా చేస్తే పూర్తి ఉపశమనం కలుగుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ ముక్కలుగా తీసుకొని జ్యూస్ గా తయారుచేసి అందులో పెరుగు, ఎగ్ వైట్ ను సమానంగా తీసుకొని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇలా ప్రతిరోజు చేస్తే సమస్య తీరుతుంది. ఇక కొందరికి దుమ్ము, దూళి, సూర్యకిరణాల నుండి కూడా చర్మం దెబ్బ తింటుంది.
ఇక వీరికి కూడా క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక చర్మం తేమగా మారటానికి క్యారెట్ పేస్టుని తయారు చేసుకొని అందులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాలు వేసి కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఇక 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
Health Tips: ఆయిల్ స్కిన్ తో బాధపడే వాళ్ళు ఇలా చేయండి..
ఆయిల్ స్కిన్ తో బాధపడే వాళ్ళు క్యారెట్ జ్యూస్ ను ఒక కప్పు తీసుకొని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసం లను టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని బాగా కలిపి ముఖానికి, మెడకు బాగా ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అంతేకాకుండా క్యారెట్ ను అలోవెరా జ్యూస్తో కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది