Health Tips: నాలుక రంగును బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు డాక్టర్లు. అందుకే ముందుగా మన నాలుకని పరీక్షిస్తారు. నాలుకని చూడడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయొచ్చు అంటున్నారు వైద్యులు. సాధారణంగా నోటిని శుభ్రపరచుకోవడానికి చూపించే శ్రద్ధ నాలుకని శుభ్రపరుచుకోవటానికి చూపించరు చాలామంది.
దీనివల్ల నాలుక మీద ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా నాలుక నలుపు రంగులో ఉంది అంటే దాని అర్థం వారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటారు అని. అలాగే టీలు, కాఫీలు, సిగరెట్లు ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా నాలుక నల్లగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ రోగులలోను కీమో తెరఫీ చేయించుకున్న రోగులలోను నాలుక నల్లగా ఉండడం మనం ఎక్కువగా గమనించవచ్చు.
చూయింగ్ గమ్ నవలటం వల్ల కూడా నాలుక మీద బ్యాక్టీరియా పెరిగి రంగు మారే అవకాశం ఉంది. అంటే నాలుక మన ఆహారపు అలవాట్లు మార్చుకోమని మనతో చెప్తున్నట్లే మనమే అర్థం చేసుకోవాలి. అలాగే నాలుక గులాబీ రంగులో ఉండి ప్రేమగా మృదువుగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క. నాలిక ఊదా రంగులో ఉంటే రక్తప్రసరణ లోపాలు ఉన్నాయని అర్థం.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాలుక ఉదా రంగులోకి మారుతుంది. నాలుక తెల్లగా ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లే గుర్తించండి. నాలుక తెల్లగా ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బలహీనపడటం వంటివి ఏర్పడతాయి. అలాగే ఎరుపు రంగులో ఉంటే పోలిక్ యాసిడ్ లోపల ఉందని భావించాలి.
Health Tips:
ఒక్కొక్కసారి నాలుగు పై మ్యాప్ లాంటి నమూనాలు కనిపిస్తుంటాయి. అలా ఉంటే ఎలర్జీలు, షుగర్ లేకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. జాగ్రత్త వహించండి,అవసరమైతే డాక్టర్లను సంప్రదించండి.