Health Tips: పాల మీగడ నుండి తయారుచేసే నెయ్యిని చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తెలియడంతో బరువు పెరిగిపోతారన్న భయంతో నెయ్యిని తినడం కొంతవరకు తగ్గించారు. ఇక నెయ్యి రుచికి బాగుంటుంది. వేడివేడి అన్నంలో పప్పుతో నెయ్యి వేసుకుంటే నిజానికి ఆ రుచియే వేరు.
నెయ్యిలో చాలా పోషక విలువలు కూడా ఉంటాయి. ఇక ఒక టీ స్పూన్ నెయ్యిలో 42 కేలరీలు, 0 గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల కొవ్వు, 0 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఫైబర్, చక్కెర ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సి, డి, కె ఉంటాయి. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, కీళ్ల నొప్పులు, కంటి శుక్ల ప్రమాదాలు తగ్గుతాయి.
అంతేకాకుండా గుండె జబ్బుల సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక నెయ్యితో మంచి ఆహార పదార్థాలు చేసుకొని తినడం వల్ల పోషకాలు అందుతాయి. నెయ్యిలో లభించే సిఎల్ఎ అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది నెయ్యి. ఇక నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఆహార భాగంలో మాత్రమే మితంగా తీసుకోవాలి.
Health Tips:
ముఖ్యంగా నెయ్యి మితంగా తీసుకుంటే గుండె జబ్బులు ప్రమాదానికి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ సంతృప్త కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక ముఖ్యంగా గుండె ఇతర ప్రమాద కారకాలు వ్యాధులు ఉన్నవాళ్లు నెయ్యి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పడాలి. ఇక నెయ్యిలోని సీఎల్ఏ కొంతమందిలో వేగంగా బరువు పెరగకుండా చేస్తుంది. ఇక కొవ్వు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా నెయ్యి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఉబయకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నెయ్యిని ఎక్కువగా తీసుకునే వాళ్ళు చాలావరకు తగ్గించడమే మంచిది.