Health Tips: ఒకప్పుడు కంటి సమస్యలు 50 సంవత్సరాలు దాటితేనే గాని తలెత్తేది కాదు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ ప్రపంచంలో చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు ప్రధానమైన కారణం టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా జరిగే విద్యా విధానం. ఇవన్నీ కంటి చూపు మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
వాటి నుంచి తప్పించుకునే పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో లేదు. ఎందుకంటే ఆధునిక విద్యా విధానం మొత్తం ఆన్లైన్ లోనే సాగుతుంది. అందుకని మనం తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే కంటి చూపు మెరుగవుతుందంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దాం. మీ ఆహారంలో చిక్కుళ్ళు, బీన్స్ వంటి కాయగూరల్ని తప్పకుండా తీసుకోండి ఇందులో ఉండే బయో ప్లావనాయిడ్స్, జింగ్ మీ రెటీనాను కాపాడతాయి. అంతేకాకుండా శుక్లాలు పెరగకుండా కాపాడతాయి.
కళ్ళని ఆరోగ్యంగా ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాలెట్సు బాదం పిస్తా వంటి వాటిలో విటమిన్ ఈ, ప్యాటియాసిడ్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్కులర్ డి జనరేషన్ సమస్య తగ్గుతుంది అంటున్నారు వైద్యులు. పుల్లగా ఉండే పండ్లని తీసుకోవడం ద్వారా కూడా కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే వాటిలో ఉండే విటమిన్ సి మాక్యులర్ క్షీణత సమస్య రాకుండా కళ్ళని కాపాడుతుంది. రంగురంగుల కాయగూరలను తీసుకోవడం కూడా కంటికి చాలా మంచిది.
ఎందుకంటే వీటిలో విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఆకుకూరల్లో కూడా ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకని వాటిని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి వయసు మీద పడినా సరే కంటి చూపు మందగించకుండా చూడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే కంటి చూపుకి విటమిన్ ఏ మరియు జింక్ ఖనిజం చాలా అవసరం అవి ఎక్కువగా పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. ఇవి కంటి చూపులు సహజంగా మెరుగుపడటంలో సహాయపడతాయి. అందుకని పాల ఉత్పత్తులు కూడా మీ ఆహారంలో భాగాన్ని చేసుకోండి.
Health Tips
మరి ముఖ్యంగా చేపలని తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి వాపుని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటితోపాటు గుడ్లు, క్యారెట్లు కూడా కంటికి చాలా మంచిది కాబట్టి నివారించలేని సమస్యలను కనీసం పెరగకుండా ఆహార నియమాల ద్వారా అడ్డుకుందాం. కంటి చూపు మరీ మందగించినప్పుడు సొంత చిట్కాలతో కాకుండా వైద్యులని సంప్రదించడమే మంచిది.