Health Tips: ఇప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నాం కానీ ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వంటింటి చిట్కాలే అందుబాటులో ఉండేవి.. కానీ ఇప్పుడు ఆ చిట్కాలు పాటించకపోవడంతో లేని కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇంటి చిట్కాలే మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకు ఆ చిట్కాలు ఏందో చూద్దాం.
ఉదయం పూట తీసుకునే టిఫిన్లలో ఇడ్లీ, దోశ, వడ కాకుండా జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీలను, దోషాలను తినాలి. ఉడకబెట్టిన శనగలను, మొలకెత్తిన గింజలను తినాలి. ముఖ్యంగా నూనెతో చేసిన టిఫిన్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఇక మధ్యాహ్న భోజనంలో బియ్యంతో వండినా అన్నం కంటే రాగిసంకటి, ముడి బియ్యం, కొర్ర అన్నం తినటం చాలా మంచిది. వారానికి మూడుసార్లు ఆకుకూరలు తీసుకోవాలి.
ఇక రాత్రి తీసుకునే భోజనంలో అన్నం కి బదులు రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకోవాలి. ఇక అవి కూడా ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే తీసుకోవడం మంచిది. ఇక ఆహారం వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు వారానికి ఒక మూడు సార్లు నువ్వుల ఉండలు, వేరుశనగ లడ్డులు తీసుకోవడం మంచిది. సీజన్ పండ్లను కచ్చితంగా తీసుకోవాలి.
Health Tips:
నువ్వులు తీసుకోవడం వల్ల అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీ బదులు రాగి జావ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటివల్ల షుగర్ వంటి వ్యాధులు
కూడా దరి చేరవు. కాబట్టి నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఇటువంటివి చేర్చుకోవటం మంచిదని వైద నిపుణులు సలహాలు ఇస్తున్నారు.